కరివేపాకు మేలు అంతా ఇంత కాదు..

కరివేపాకు మేలు అంతా ఇంత కాదు..
x
Highlights

కరివేపాకు.. పుష్కలమైన విటమిన్లు లభిస్తాయి. పెరుగన్నం, ఆవడ, పకోడీలు, ఉప్మా, పులిహోర, మిక్స్చర్ వంటి వంటకాలకూ, వంకాయ ఇగురు, బజ్జీ వంటి చట్నీల్లో...

కరివేపాకు.. పుష్కలమైన విటమిన్లు లభిస్తాయి. పెరుగన్నం, ఆవడ, పకోడీలు, ఉప్మా, పులిహోర, మిక్స్చర్ వంటి వంటకాలకూ, వంకాయ ఇగురు, బజ్జీ వంటి చట్నీల్లో కరివేపాకు ఉంటే ఆ వంట మాజాగా ఉంటుంది. కరివేప ఆకుల్లో కాల్షియం, ఫాస్ఫరస్, పీచు పదార్థం, విటమిన్-ఏ, విటమిన్-సీ పుష్కలంగా ఉంటాయి. కరివేప వేళ్లు, కాండం, బెరడు, ఆకులు వైద్యపరంగా చాలా విలువైనవి.

కరివేపాకు పొడిని నెయ్యితో కలిపి వేడి అన్నంతో తీసుకుంటే..? ఆరోగ్యానికి ఎంతో మేలు . ఉదర సంబంధిత వ్యాధులు తగ్గలంటే కరివేపాకుతో మిరియాలు, ఉప్పు, జీలకర్రను చేర్చి పొడి కొట్టుకుని నెయ్యి కలిపి తీసుకోవాలి వేయించిన ఉప్పు, మిరపకాయలను కరివేపాకుతో కాల్చిన చింతపండుతో తీసుకుంటే పేగు వ్యాధులను దూరం చేస్తుంది. పిత్తాన్ని హరించే గుణం కరివేపాకు ఉంది. చేతులు కాళ్ళు దడను తగ్గించి. వృద్ధాప్య ఛాయలకు చెక్ పెడుతుంది. చక్కెర సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది. గుండెపోటును, క్యాన్సర్‌ను నియంత్రిస్తుంది. స్ధూలకాయంతో బాధపడేవారికి కరివేపాకు ఎంతగానో మేలు చేస్తుంది. రోజు భోజనానికి ముందు కొన్ని కరివేపాలకు అలాగే నమిలి తింటే శరీరంలో కొవ్వు చేరకుండా ఉంటుంది. కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల శరీరానికి ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. అవి శ్వాసకోశ సమస్యల నుంచి రక్షణ లభిస్తుందని ఆయుర్వేద సూచించబడింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories