నల్లమిరియాలు దివ్యౌషధం

నల్లమిరియాలు దివ్యౌషధం
x
Highlights

మన వచ్చే తగ్గించుకోవడానికి మన వంటింట్లోనే అనేక ఔషదాలు ఉన్నాయి. కానీ మనం వాటిని గుర్తించకుండా ప్రతి చిన్నదానికి డాక్టర్ ఆశ్రయిస్తాం.మన వంటింట్లో ఉండే...

మన వచ్చే తగ్గించుకోవడానికి మన వంటింట్లోనే అనేక ఔషదాలు ఉన్నాయి. కానీ మనం వాటిని గుర్తించకుండా ప్రతి చిన్నదానికి డాక్టర్ ఆశ్రయిస్తాం.మన వంటింట్లో ఉండే అద్భుతమైన ఓ ఔషధం గురించి మనం తెలుసుకుందాం. వర్షాకాలం వేధించే అనారోగ్యాలకు అడ్డుకట్ట వేయడానికి నల్ల మిరియాలతో సహయపడుతాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. జలుబు, దగ్గు, అజీర్తి, కండరాల నొప్పులపై ఇది దివ్యౌషధంగా పనిచేస్తుంది. నల్ల మిరియాల్లో ఉండే యాంటీ మైక్రోబియల్ జలుబు కారక సూక్ష్మజీవులను నివారిస్తాయి.

ఛాతీలో నెమ్మును తగ్గించడంతో పాటు, వీటిలోని విటమిన్ సి శరీరానికి తోర్పాడుతుంది. అలాగే వీటిలో యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా లభ్యమవుతాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు కణ వినాశనాన్ని అరికడతాయి. దీంతో క్యాన్సర్ ముప్పును తగ్గిస్తాయి. వాటిలోని ఔషధ గుణాలు చర్మ సంరక్షణకు ఎంతగానో తోడ్పడతాయి.

చర్మవ్యాధులను నల్లమిరియాలతో తగ్గించుకోవచ్చు. మోకాళ్ళ వద్ద వచ్చే కార్టిలేజ్ టిష్యూలో వాపును తగ్గిస్తాయి. జీర్ణక్రియ సజువుగా జరిగేందుకు నల్లమిరియాలు తీసుకోవడం ఉత్తమం. తద్వారా జీర్ణ రసాల ఉత్పత్తి మెరుగువుతుంది. డయేరియా లాంటి వ్యాధుల బారిన పడకుండా శరిరాన్ని రక్షించుకోవచ్చు. నల్లమిరియాలను వంటకాల్లో ఉపయోగించుకోవడం కంటే మెత్తగా పొడిలా తయారుచేసుకుని వేడి పాలల్లో కలిపుకుని తాగితే ఎంతో శ్రేయస్కరమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories