షోషకాల గనులు నువ్వులు

షోషకాల గనులు నువ్వులు
x
Highlights

ఇప్పుడు చాలా మందికి జుట్టు రాలడం పెద్ద సమస్యగా మారిపోయింది. అయితే కొన్నిఇంటి చిట్కాలు పాటించడం ద్వారా జుట్టు రాలడం సమస్యను తగ్గించుకోవచ్చు. మనం తినే...

ఇప్పుడు చాలా మందికి జుట్టు రాలడం పెద్ద సమస్యగా మారిపోయింది. అయితే కొన్నిఇంటి చిట్కాలు పాటించడం ద్వారా జుట్టు రాలడం సమస్యను తగ్గించుకోవచ్చు. మనం తినే తిండిలో తెల్లనువ్వులు, నల్లనువ్వులు ఉండేలా చూసుకోవాలి. వీటిలో అత్యధిక పోషకవిలువలు, ఔషధగుణాలు ఉంటాయి.. నువ్వుల్లో ఉండే ప్రొటీన్లు తక్షణ శక్తిని ఇవ్వడానికి ఎంతో ఉపకరిస్తాయి.

నువ్వుల నూనెలో జుట్టుకు కావాల్సిన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వారానికి రెండు రోజులు తలకు రాసుకుంటే.. జుట్టు రాలదు. చుండ్రు కూడా వేగంగా తగ్గుతుంది. నువ్వుల్లో మెగ్నీషియంతో పాటు అదనపు పోషకవిలువలు కూడా ఉంటాయి. అలాగే నువ్వుల నూనె మధుమేహాన్ని నియంత్రిస్తుంది. అధిక రక్తపోటు కలిగిన వారికి నువ్వుల్లోని మెగ్నీషియం ఎంతో మేలు చేస్తుంది. కొవ్వులు అధికంగా తినడం వల్ల అవి రక్తంలో పేరుకుపోతే హృద్రోగాలు వస్తాయి. అయితే కొవ్వుల్ని తగ్గించడంలో నువ్వులు చేసే మేలు చెస్తాయి.

అలాగే అజీర్తి మస్యను తొలగించే గుణం నువ్వులకు ఉంది. క్యాన్సర్‌ కారకాలను అడ్డుకునే శక్తి నువ్వుల నూనెకు అధికం. అందులోను చర్మ సంబంధిత వ్యాధుల్ని దరి చేరనివ్వదు. నువ్వుల్లో జింక్‌ చర్మకాంతిని పెంచుతుంది.వీటిలోని మెగ్నీషియం, కాల్షియం మానసిక ఒత్తిళ్లను తగ్గిస్తాయి. ప్రశాంత నిద్రకు దోహదం చేసే స్వభావం నువ్వులకు ఉంది. నల్లటి నువ్వుల్లో ఎక్కువగా ఇనుము ఉంటుంది. ఇవి ఎనీమియా, బలహీనతలను తగ్గిస్తాయి. ఇన్ని పోషకాలు ఉన్న నువ్వులను మీ రోజువారి డైట్‌లో చేర్చుకోండి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories