పుదీనా అకుల పేస్ట్‌తో ఎన్ని ఉపయోగాలో..

పుదీనా అకుల పేస్ట్‌తో ఎన్ని ఉపయోగాలో..
x
Highlights

పుదీనా ఆయుర్వేదంలో ప్రత్కేక స్థానం ఉంది. ప్రాచీన సంస్కృతిలో పుదీనాను వంటకాలలోనూ, ఔషధ పరంగాను విస్తృతంగా ఉపయోగించేవారు. వాటికి వాసనే కాకుండా రుచి, ఔషధ...

పుదీనా ఆయుర్వేదంలో ప్రత్కేక స్థానం ఉంది. ప్రాచీన సంస్కృతిలో పుదీనాను వంటకాలలోనూ, ఔషధ పరంగాను విస్తృతంగా ఉపయోగించేవారు. వాటికి వాసనే కాకుండా రుచి, ఔషధ శక్తి ఉన్నాయని గుర్తించారు. వాటిని వంటల్లోనే కాకుండా సలాడ్లు, పానీయాల్లో పుదినాను విస్తృతంగా ఉపయోగించవచ్చు. పుదీనా టీలో అనేక ప్రయోజనాలున్నాయి.

తాజాదనాన్ని అందించడంలో కూడా పుదీనా ప్రముఖ పాత్ర వహిస్తుంది. చూయింగ్ గమ్, టూత్ పేస్ట్, మరెన్నో మందుల్లో ఎలా వాడినా పుదీనా తాజాదనాన్ని చక్కగా అందిస్తుంది. మాంగనీస్, విటమిన్ ఎ, విటమిన్ సి వాటిలో పుష్కలంగా ఉంటాయి. విటమిన్ బి2, ఒమెగా-3 ఫ్యాటి యాసిడ్స్, పీచు, ఫోలేట్ ఐరన్, మేగ్నీషియం క్యాల్షియం, పొటాషియం, కాపర్ ఎక్కువగా లభిస్తాయి. ఆయుర్వేదంలో పుదీనాను ఆయా వ్యాధుల నివారణకై ఉపయోగిస్తారు.

తలనొప్పికి విరుగుడిగా పుదీనా పనిచేస్తుంది. పుదీనా ఆకులు ముద్దగా చేసి నుదిటిపై వేయాలి. ఆకులు నలిపి వాసన చూడాలి. దీంతో నోప్పిని తొందరగా నయం చేసుకోవచ్చు. అలాగే జుట్టు ఊడటం, పేలు నివరించడంలో కూడా పుదీనా ఉపచయోడపడుతుంది. వాటి ఆకులను పేస్ట్‌ చేసి రాత్రి తలకు పట్టించాలి. తర్వాత పొద్దుటే స్నానం చెయ్యాలి. పుదీనా కషాయం రోజు 2 సార్లు తాగాలి.దగ్గు జలుబు దూరమవుతుంది. పుదీనా కషాయంలో ఉప్పు కలిపి పుక్కిలించడం ద్వారా గొంతునొప్పు తగ్గుతుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories