Health Alert: ఉప్పు వాడకంపై డాక్టర్ల హెచ్చరిక అధికంగా తీసుకుంటే ఇది తెల్లని విషమే!

Health Alert: ఉప్పు వాడకంపై డాక్టర్ల హెచ్చరిక అధికంగా తీసుకుంటే ఇది తెల్లని విషమే!
x

Health Alert: ఉప్పు వాడకంపై డాక్టర్ల హెచ్చరిక అధికంగా తీసుకుంటే ఇది తెల్లని విషమే!

Highlights

చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు రోజు తీసుకునే ఆహారంలో ఎంత ఉప్పు కలుపుకుంటున్నామో చాలామందికి స్పష్టంగా తెలియదు. అందుకే నిపుణులు ఉప్పును "తెల్ల విషం"గా అభివర్ణిస్తున్నారు.

చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు రోజు తీసుకునే ఆహారంలో ఎంత ఉప్పు కలుపుకుంటున్నామో చాలామందికి స్పష్టంగా తెలియదు. అందుకే నిపుణులు ఉప్పును "తెల్ల విషం"గా అభివర్ణిస్తున్నారు. ఇలాంటి హెచ్చరికలతో పాటు, భారతదేశంలో ఉప్పు అధిక వాడకం ఇప్పుడు ఒక 'కనిపించని మహమ్మారి'గా మారుతోందని ICMR (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) హెచ్చరిస్తోంది.

ఉప్పుతో వచ్చే ప్రమాదాలు:

ఉప్పు ఎక్కువగా తినడం వల్ల అధిక రక్తపోటు, గుండె సంబంధిత రుగ్మతలు, మూత్రపిండాల సమస్యలు, పక్షవాతం వంటి జబ్బులు దాడి చేయవచ్చు. ఇదే కాకుండా వాపులు, ఊబకాయం, చర్మ వ్యాధులు, జుట్టు రాలడం, మానసిక సమస్యలు, ఎముకల బలహీనత, కంటికి సంబంధించిన వ్యాధులు కూడా చుట్టుముడతాయి.

డాక్టర్ సంతోష్ నెవపురకర్ ఈ విషయంలో మాట్లాడుతూ, ఉప్పును తగిన మోతాదులో మాత్రమే తీసుకోవాలని సూచించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సిఫార్సు ప్రకారం, రోజుకు 5 గ్రాముల కన్నా ఎక్కువ ఉప్పు తీసుకోకూడదు.

మనం అనుకోకుండా ఎక్కువగా తీసే ఉప్పు:

ఊరగాయలు, అప్పడాలు, మసాలా అప్పడం వంటి వాటిలో ఉప్పు అత్యధికంగా ఉంటుంది.

ఫర్సాన్, ఇతర తినుబండారాల్లోనూ ఉప్పు అధికంగా ఉంటుంది.

ఆకుకూరలలో సహజంగా కొంతమేర ఉప్పు ఉండే అవకాశం ఉంటుంది.

జాగ్రత్తలు పాటించాలి:

వంట సమయంలో తగినంత ఉప్పు మాత్రమే వాడాలి.

వంట పూర్తైన తర్వాత ఉప్పు కలపడం మానేయాలి.

ఉప్పు కలిపిన నీటిని తాగకూడదు.

సాధారణ ఉప్పు బదులు, సైంధవ లవణం (low sodium salt) వాడడం మంచిది.

వారంలో ఒక్కరోజైనా ఉప్పు పదార్థాలు తీసుకోకుండా ఉండాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

ఉప్పు – నిశ్శబ్ద కిల్లర్!

ఉప్పు తక్కువ మోతాదులో ఆరోగ్యానికి అవసరం అయినా.. ఎక్కువగా తీసుకుంటే అది నిశ్శబ్దంగా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అందుకే దీన్ని "సైలెంట్ కిల్లర్" అని కూడా పిలుస్తారు.

మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఉప్పు వాడకంలో జాగ్రత్తలు తప్పనిసరి.

Show Full Article
Print Article
Next Story
More Stories