పిల్లలకు స్మార్ట్‌ఫోన్ ఇస్తున్నారా?

పిల్లలకు స్మార్ట్‌ఫోన్ ఇస్తున్నారా?
x
Highlights

పిల్లలను తల్లిదండ్రులు బాగా గారాబం చేస్తున్నారు. వారు ఏది అడిగితే అది వారికి ఇచ్చేయేడం పేరెంట్స్‌కు పరిపాటుగా మారిపోయింది. తాము ఏది చేసినా పిల్లల...

పిల్లలను తల్లిదండ్రులు బాగా గారాబం చేస్తున్నారు. వారు ఏది అడిగితే అది వారికి ఇచ్చేయేడం పేరెంట్స్‌కు పరిపాటుగా మారిపోయింది. తాము ఏది చేసినా పిల్లల కోసమే కదా. అలాటప్పుడు వాళ్లు అడిగింది ఇవ్వకపోతే ఎట్లా? అని అంటున్నారు తల్లిదండ్రులు. పిల్లలు అడిగిందల్లా వారికిస్తున్నారు ఓకే.. కానీ.. వాళ్లు అడుగింది ఏంటి? మీరు ఏం వారికి కొనిస్తున్నారు? అనేది చాలా ముఖ్యమైన విషయం. చాకోలేటో, బిస్కేటో అడిగితే కొనివ్వడంలో తప్పు లేదు. బొమ్మలు కావాలంటే కొనివ్వడంలో తప్పు లేదు. అలా అని వాళ్లు స్మార్ట్‌ఫోన్ కావాలంటే కూడా కొనిస్తారా? లేదా వాళ్ళ అడిగారు కదా అని..మీ ఫోన్లను వాళ్ళకు ఇస్తున్నారా? అలా వాళ్ళకు ఎలాక్ట్రానిక్ గ్రాడ్జేట్స్‌ను అలవాటు చేసోరో ఇక అంతే సంగతులు.

మీ పిల్లలకు స్మార్ట్‌ఫోన్ అలవాటు మారిందంటే. వాళ్లు మీరు డ్రగ్స్ అలవాటు చేసినట్టే. స్మార్ట్‌ఫోన్‌కు, డ్రగ్స్‌కు ఏంటి సంబంధం అంటారా? సంబంధం ఉంది. పిల్లలు స్మార్ట్‌ఫోన్లను వదలడం లేదంటే వాళ్లు డ్రగ్స్‌కు అలవాటు అయినట్టే.. దానికి వారు అడిక్షన్‌గా మారిపోతారు. ఇక పిల్లలకు స్మార్ట్‌ఫోన్ తప్పించి ఇంకో లోకం ఉండదు. చదువులోనూ వెనుకబడిపోతారు. వాళ్ల భవిష్యత్తును మీరే చేజేతులారా నాశనం చేస్తున్నారు. కావున వారికి స్మార్ట్‌ఫోన్ అలవాటు చేయకండి. వాళ్ళకు కాలక్షేపం కోసం బుక్స్ చదవేలా పోత్సాహించండి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories