Top
logo

మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌ని అతిగా వాడుతున్నారా..!

మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌ని అతిగా వాడుతున్నారా..!
X
Highlights

ఓ మూవీలో చెప్పినట్టుగా 'వైఫ్ లేని ఇళ్లు ఉంటున్నాయి కానీ వైఫై లేని ఇళ్లు ఉండట్లేదు'. స్మార్ట్‌ఫోన్‌ను అంతలా...

ఓ మూవీలో చెప్పినట్టుగా 'వైఫ్ లేని ఇళ్లు ఉంటున్నాయి కానీ వైఫై లేని ఇళ్లు ఉండట్లేదు'. స్మార్ట్‌ఫోన్‌ను అంతలా వాడేస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు అయితే వీటికి బానిసలుగా మారిపోతున్నారు. పిల్లల చేతికి స్మార్ట్‌ఫోన్ ఇస్తే డ్రగ్స్ ఇచ్చినట్టే అంటున్నారు నిపుణులు. పిల్లల చేతిలో స్మార్ట్ ఫోన్ లు తల్లిదండ్రులకు పెద్ద సమస్యగా మారింది. వారిని మొబైల్ నుంచి దూరంగా ఉంచడానికి నానాయాతనలు పడుతున్నారు పేరెంట్స్. పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు మొబైల్ ఫోన్లు అడ్డంకిగా మారుతున్నాయి అంటున్నారు నిపుణులు. చాలమంది పిల్లలో చాకొలెట్ల వ్యసనం కంటే స్మార్ట్‌ఫోన్ల వ్యసనమే ఎక్కువగా ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. పిల్లలు స్మార్ట్ ఫోన్‌ నుంచి దూరంగా ఉండాలండే పేరెంట్స్ ఏం చేయాలి.. కొన్ని టిప్స్ ద్వారా పిల్లల ఆలోచనలను మార్చొచ్చు అంటున్నారు నిపుణులు.

*పిల్లలు ఏం చేస్తున్నారో పేరెంట్స్ గమనిస్తూ ఉండాలి.. ముఖ్యంగా ఎంతసేపు మొబైల్ వాడాలో వారికి పక్కాగా చెప్పాలి.

*అదికూడా కేవలం ముఖ్యమైన విషయాలు తెలుసుకోవడానికి మాత్రమే.

*ఇంటర్నెట్‌‌లో వాళ్లేం చూస్తున్నారో పిల్లలతో కూల్‌గా మాట్లాడి తెలుసుకోవాలి.

*ఏది కనిపిస్తే దానిపైన క్లిక్ చేయడం ప్రమాదకరమని వారికి అర్థమయ్యేలా చెప్పాలి.

* పిల్లలకు అవసరం లేని వెబ్‌సైట్లు ఫోన్‌లో కనిపించకుండా సెట్టింగ్స్ మార్చాలి.

* ఇంటర్నెట్‌లో వ్యక్తిగత సమాచారం పంచుకోవడం ప్రమాదకరమని హెచ్చరించాలి.

అన్నిటికంటే ముఖ్యమైనది.. పిల్లలకు చెప్పే ముందు పేరెంట్స్ తమ అలవాట్లను మార్చుకోవాలంటున్నారు నిపుణులు.

Next Story