Happy Rose Day 2026: వాలెంటైన్ వీక్ షురూ.. 'రోజ్ డే'తో మీ ప్రేమ ప్రయాణాన్ని మొదలుపెట్టండి! మీ పార్ట్నర్ కోసం హార్ట్ టచింగ్ విషెస్ ఇవే..


Happy Rose Day 2026: వాలెంటైన్ వీక్ షురూ.. 'రోజ్ డే'తో మీ ప్రేమ ప్రయాణాన్ని మొదలుపెట్టండి! మీ పార్ట్నర్ కోసం హార్ట్ టచింగ్ విషెస్ ఇవే..
Happy Rose Day 2026: వాలెంటైన్ వీక్ మొదలైంది! రోజ్ డే సందర్భంగా మీ మనసులోని ప్రేమని అందమైన మాటలతో వ్యక్తపరచండి. మీ పార్ట్నర్ హృదయాన్ని గెలుచుకునే బెస్ట్ రొమాంటిక్ విషెస్ మరియు మెసేజ్‌లు ఇక్కడ ఉన్నాయి.
Happy Rose Day 2026: ప్రేమ జంటలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే 'వాలెంటైన్ వీక్' (Valentine Week) రానే వచ్చింది. ఫిబ్రవరి నెల వచ్చిందంటే చాలు ప్రపంచవ్యాప్తంగా ప్రేమ సువాసనలు వెదజల్లుతాయి. కాలం ఏదైనా, వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరినీ పలకరించే మధురమైన అనుభూతి ‘ప్రేమ’. ఈ అద్భుతమైన వారం ‘రోజ్ డే’తో ఘనంగా ప్రారంభం కాబోతోంది.
రోజ్ డే.. మౌన భాషా గులాబీ! వాలెంటైన్ వీక్‌లో మొదటి రోజైన రోజ్ డే అత్యంత కీలకమైనది. ఏ మాటలు చెప్పలేని భావాలను ఒక చిన్న గులాబీ పువ్వు సులభంగా అవతలి వ్యక్తికి చేరవేస్తుంది. అందుకే గులాబీని 'మౌనమైన ప్రేమ భాష' అని పిలుస్తారు. ఈ ప్రత్యేక రోజున మీ పార్ట్నర్ ముఖంలో చిరునవ్వు పూయించడానికి ఈ కింది సందేశాలను పంపండి.
మీ పార్ట్నర్ కోసం ప్రత్యేక విషెస్:
రొమాంటిక్ మెసేజ్: "నా జీవితం అనే తోటలో అత్యంత అందమైన గులాబీవి నువ్వే. నీ రాకతో నా ప్రపంచం సువాసనలతో నిండిపోయింది. హ్యాపీ రోజ్ డే మై లవ్!"
ఎమోషనల్ ప్రామిస్: "గులాబీలకు ముళ్లు ఉన్నా మనం వాటిని ప్రేమిస్తాం.. అలాగే మన జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా నీ చేయి వదలకుండా నీతోనే ఉంటాను. ఈ గులాబీ వాడిపోవచ్చు కానీ, నీపై నాకున్న ప్రేమ ఎప్పటికీ తాజాగా ఉంటుంది. హ్యాపీ రోజ్ డే!"
క్యూట్ అండ్ స్వీట్: "ప్రపంచంలోని అన్ని అందమైన గులాబీలను నీ ముందే ఉంచినా, నీ అందం ముందు అవి తక్కువే. నా లైఫ్‌లోకి వచ్చినందుకు థాంక్యూ. హ్యాపీ రోజ్ డే!"
షార్ట్ అండ్ పవర్‌ఫుల్: "నువ్వు నా పక్కన ఉంటే ప్రతిరోజూ వసంత కాలమే. ఈ రోజ్ డే మన ప్రేమ బంధాన్ని మరింత బలోపేతం చేయాలని కోరుకుంటూ.. హ్యాపీ రోజ్ డే డియర్!"
ఏ రంగు గులాబీ.. ఏం చెబుతుందంటే? మీరు ఇచ్చే గులాబీ రంగును బట్టి మీ మనసులోని భావం మారుతుంది. అందుకే సరైన రంగును ఎంచుకోండి:
ఎరుపు (Red): గాఢమైన ప్రేమకు, ఇష్టానికి నిదర్శనం.
పింక్ (Pink): కృతజ్ఞత, ప్రశంసలను తెలియజేస్తుంది.
పసుపు (Yellow): స్నేహానికి, కొత్త ఆరంభాలకు చిహ్నం.
తెలుపు (White): పవిత్రమైన, స్వచ్ఛమైన ప్రేమకు గుర్తు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



