జామపండుతో జుట్టు రాలదంటే నమ్మండి!

జామపండుతో జుట్టు రాలదంటే నమ్మండి!
x
Highlights

జామపండు తినడం వల్ల శరీరానికి ఎంతో బలం లభిస్తుంది. వాటిలో ఔషధ గుణాలు అనేకం . గుండె జబ్బుతో బాధపడేవారికి జామపండు మంచి ఔషధంగా పనిచేస్తుంది. ప్రతిరోజూ...

జామపండు తినడం వల్ల శరీరానికి ఎంతో బలం లభిస్తుంది. వాటిలో ఔషధ గుణాలు అనేకం . గుండె జబ్బుతో బాధపడేవారికి జామపండు మంచి ఔషధంగా పనిచేస్తుంది. ప్రతిరోజూ భోజనంతో పాటు జామపండును మూడు నెలలపాటు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. జామపండును తింటే శరీరంలో రక్త సరఫరా సజవుగా జరిగి గుండెకు మేలు చేస్తుంది.

జామపండును రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. బాగా మాగిన జామపండు గుజ్జులో కొద్దిగా తేనెను కలిపి తింటే మంచి శక్తి లభిస్తుంది. ఉదయం, రాత్రి వేళల్లో భోజనానంతరం జామపండు తింటే జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. అలాగే మానసిక ఒత్తిడి ఉండదు. రోజూ ఒక జామకాయ తింటే ప్రొస్టేట్ క్యాన్సర్‌ను అవకాశలను తగ్గించుకోవచ్చు.

జామకాయ తినడం ద్వారా నోటికి పంబంధించిన సమస్యలను తగ్గించుకోవచ్చు. పచ్చి జామకాయ తింటే చిగుళ్లు, దంతాలు గట్టిపడతాయి. దానిలోని విటమిన్ సి అధికంగా ఉండటంతో చిగుళ్ల నుంచి రక్తస్రావం తగ్గుతుంది. జామకాయ ముక్కలను కోసి ఒక కప్పులో తీసుకుని, బాగా ఎండబెట్టి, దానికి అర చెంచా మిరియాలు ,అర చెంచా సైందవ లవణానంతో మెత్తగా పొడిచేసి సీసాలో నిల్వ చేసుకోవాలి. దాన్ని రోజూ పళ్లపొడిలా వాడితే దంతాలు గట్టి పడటమే కాకుండా చిగుళ్ల సమస్యలు ఉండవు.

జామపండు గుజ్జుతో పాటు పాలు,తేనతో పాటు కలిపి తీసుకుంటే విటమిన్-సి, కాల్షియం శరీరానికి పుష్కలంగా లభిస్తాయి. ఎదిగే పిల్లలకు గర్భిణులకు మంచి పోషక పదార్దంలా పనిచేస్తుంది. జామపండు చర్మాన్ని పదిలంగా ఉంచుతుంది. చాలా మంది ఎదుర్కొనే జుట్టు సమస్యలను కూడా నివారిస్తుంది. వాటిలోని విటమిన్ ఎ కంటికి మేలు చేస్తుంది. చూపును మరింతగా మెరుగుపరుస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories