Cancer Vaccine: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. మహిళల్లో ఆ క్యాన్సర్‌ రాకుండా టీకాలు..!

Government Introduces Cervical Cancer Vaccine Major Step to Prevent Cancer in Women
x

Cancer Vaccine: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. మహిళల్లో ఆ క్యాన్సర్‌ రాకుండా టీకాలు..!

Highlights

Cancer Vaccine: ప్రపంచాన్ని భయపెడుతోన్న అంశాల్లో క్యాన్సర్‌ ప్రధానమైంది. ఒక్కసారి ఈ వ్యాధి వచ్చిందంటే అంత సులభంగా బయటపడడం సాధ్యం కాదు.

Cancer Vaccine: ప్రపంచాన్ని భయపెడుతోన్న అంశాల్లో క్యాన్సర్‌ ప్రధానమైంది. ఒక్కసారి ఈ వ్యాధి వచ్చిందంటే అంత సులభంగా బయటపడడం సాధ్యం కాదు. క్యాన్సర్‌ మహమ్మారిని పూర్తిగా అంతమొందించేందుకు ఎన్ని రకాల ప్రయోగాలు, ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. అయినా ప్రతీ ఏటా క్యాన్సర్‌ మరణాలు మాత్రం తగ్గడం లేదు. అయితే భవిష్యత్తులో క్యాన్సర్‌ పూర్తిగా తగ్గిపోనుందా అంటే అవుననే సమాధానం వస్తోంది.

క్యాన్సర్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం క్యాన్సర్‌కు వ్యాక్సిన్‌ను తయారు చేసే విషయంలో కీలక అడుగు వేసింది. గత కొన్ని సంవత్సరాలుగా మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. దీంతో ప్రభుత్వం గర్భాశయ క్యాన్సర్ వ్యాక్సిన్‌ను అందించేందుకు సిద్ధమవుతోంది. ఈ టీకా రాబోయే 5 నెలల్లో అందుబాటులోకి వస్తుందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమం, ఆయుష్ మంత్రి ప్రతాప్రవ్ జాదవ్ విలేకరుల సమావేశంలో తెలిపారు. ఇది 9-16 సంవత్సరాల వయస్సు గల బాలికలకు ఇస్తారు.

టీకా ఎప్పుడు ప్రారంభమవుతుంది?

ఈ టీకా 5-6 నెలల్లో అందుబాటులోకి వస్తుంది. ముందుగా, ఈ టీకాను 9-16 సంవత్సరాల వయస్సు గల బాలికలకు ఇస్తారు. భవిష్యత్తులో ఈ అమ్మాయిలకు గర్భాశయ క్యాన్సర్ రాకుండా ఉండేందుకు ఇది ఉపయోగపడుతుంది. మహిళల్లో పెరుగుతోన్న ఈ క్యాన్సర్‌ను సమూలంగా నిర్మూలించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే 30 ఏళ్లు పైబడిన మహిళలకు ఆసుపత్రులలో పరీక్షలు నిర్వహించనున్నారు. వ్యాధిని ముందస్తుగా గుర్తించడానికి డే కేర్ క్యాన్సర్ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే మందులపై కస్టమ్స్ సుంకాన్ని కూడా ప్రభుత్వం మాఫీ చేసిందని మంత్రి తెలిపారు.

మహిళలను ప్రభావితం చేసే క్యాన్సర్‌కు వ్యాక్సిన్‌పై పరిశోధన దాదాపు పూర్తయిందని తెలిపారు. ఐదు నుంచి ఆరు నెలల్లో ఈ వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ టీకా రొమ్ము, నోరు, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌లను సమర్థవంతంగా అడ్డుకుంటుందని కేంద్ర మంత్రి చెప్పుకొచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories