కీళ్ల నొప్పులకు చక్కటి పరిష్కారాలు

కీళ్ల నొప్పులకు చక్కటి పరిష్కారాలు
x
Highlights

వయస్సు పైబడిన వారినే కాదు.. వయస్సులో ఉన్న వారిని ప్రస్తుతం వేధిస్తున్న సమస్య కీళ్లనొప్పులు...ఇవి జీవితాన్ని నరకప్రాయం చేస్తయి.కూర్చోవాలన్నా ,...

వయస్సు పైబడిన వారినే కాదు.. వయస్సులో ఉన్న వారిని ప్రస్తుతం వేధిస్తున్న సమస్య కీళ్లనొప్పులు...ఇవి జీవితాన్ని నరకప్రాయం చేస్తయి.కూర్చోవాలన్నా , నిల్చోవాలన్నా..అడుగు తీసి అడుగు వేయాలన్నా..వేయలేని పరిస్థితి నెలకొంటుంది..వయస్సు పై బడిన వారికి యముకల అరుగుదల వల్ల ఈ సమస్య వస్తే...3 పదులు దాటిని వారిలో మాత్రం స్థూలకాయం. పోషకాహారం, అహార నియమాలను అతిక్రమించడం ద్వారా సంభవిస్తుందని నిపుణుల మాట.

ఈ నొప్పులను తగ్గించుకునేందుకు ఎన్ని మందులు వాడినా...ట్రీట్‌మెంట్‌లు తీసుకున్నా అవి టెంపరరీగా పనిచేస్తాయే తప్ప పర్మనెంట్ సొల్యేషన్ చూపించలేవు..మరి ఈ సమస్య నుంచి బయటపడేందుకు జీవన క్రమంలో ఎలాంటి పద్ధతులను పాటించాలి....ఎలాంటి ఆహారం తీసుకోవాలి....ఇంట్లో దొరికే పదార్ధాలతో సహజసిద్ధమైన వైద్యపు విధానాలను తెలుసుకుందాం పదండి

ప్రతి రోజు ఉదయం వెలువడే సూర్యకిరణాలను మన శరీరం స్వీకరించడం వల్ల విటమిన్ డి ఉత్పత్తి అవుతుంది. దీని వల్ల యముకలు చాలా ధృడంగా తయారవుతాయి. కాబట్టి వీలుదొరికినప్పుడల్లా సూర్యకాంతిలో కాస్త సమయాన్ని గడపండి. వయస్సు పెరుగుతున్నా కొద్దీ ఎముకల్లో బలం తగ్గుతుంది...దీంతో కీళ్ల నొప్పులు వస్తుంటాయి..అందుకని...వెచ్చని నూనెతో నిత్యం మసాజ్ చేసుకోవాలి. ముఖ్యంగా శీతలకాలంలో ఈ సమస్య అధికంగా ఉంటుంది కాబట్టి వేడి నూనెతో మర్ధనా చేసుకుని వేడి వాతావరణం ఉన్న సమయంలో గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి..

డాక్టర్లు ఊరికే చెప్పడం లేదు...కుర్చీలను వదిలి నడక ప్రారంభించమని. నడక అన్ని వయస్సుల వారికి, అన్ని సీజన్లలోనూ ఆరోగ్యానికి ప్రయోజనకరంగానే ఉంటుంది. నడకతో పాటు వ్యాయామం కూడా ఎముకలకు మంచి ఆరోగ్యాన్ని అందిస్తుంది...వ్యాయామాల ద్వారా యముకలు ఆరోగ్యంగా ఉండటంతో పాటు శరీరానికి మేలు చేస్తుంది...అంతేకాదు మానసిక వికాసానికి తోడ్పడుతుంది...

శరీరానికి కావాల్సిన పోషకాలను అందించడంలో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా కీళ్ల నొప్పులు సంభవిస్తుంటాయి...కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ముఖ్యంగా కాల్షియం, ఖనిజాలు లభించే ఆహారాలను సేవిస్తూ ఉండాలి. ఆహార నియమాలు పాటించాలి...ప్రధానంగా పాలు, పెరుగు, బ్రోకలీ, ఆకుకూరలు, నువ్వులు, అంజీర , సోయా వంటి పోషకాహారాన్ని తీసుకోవాలి. వీటితో పాటు చిరుధాన్యాలను ఆహారంలో భాగంగా చేసుకోవాలి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories