Golden Blood: ఈ రక్తం నిజంగా ‘బంగారమే’! ప్రపంచంలోనే అరుదైన గోల్డెన్ బ్లడ్ గురించి తెలుసా?

Golden Blood
x

Golden Blood: ఈ రక్తం నిజంగా ‘బంగారమే’! ప్రపంచంలోనే అరుదైన గోల్డెన్ బ్లడ్ గురించి తెలుసా?

Highlights

Golden Blood: మనం సాధారణంగా రక్త గ్రూప్‌ల గురించి మాట్లాడితే A, B, AB, O అనే నాలుగు రకాలే గుర్తుకు వస్తాయి. కానీ వాటికన్నా చాలా అరుదైన బ్లడ్ గ్రూప్‌ ఒకటి ఉంది. అదే ‘గోల్డెన్ బ్లడ్’ (Golden Blood)! ప్రపంచవ్యాప్తంగా కేవలం 50 మందికి మాత్రమే ఈ రక్త గ్రూప్ ఉంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

Golden Blood: మనం సాధారణంగా రక్త గ్రూప్‌ల గురించి మాట్లాడితే A, B, AB, O అనే నాలుగు రకాలే గుర్తుకు వస్తాయి. కానీ వాటికన్నా చాలా అరుదైన బ్లడ్ గ్రూప్‌ ఒకటి ఉంది. అదే ‘గోల్డెన్ బ్లడ్’ (Golden Blood)! ప్రపంచవ్యాప్తంగా కేవలం 50 మందికి మాత్రమే ఈ రక్త గ్రూప్ ఉంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అందుకే దీనిని ప్రపంచంలోనే అత్యంత విలువైన రక్తంగా భావిస్తారు.

గోల్డెన్ బ్లడ్ అంటే ఏమిటి?

గోల్డెన్ బ్లడ్ అనేది Rh-null బ్లడ్ గ్రూప్. అంటే, ఈ రక్తంలో Rh ఫ్యాక్టర్‌కు సంబంధించిన ఏ యాంటీజన్‌లు కూడా ఉండవు. మనం సాధారణంగా వినే Rh పాజిటివ్, Rh నెగటివ్ అనే వర్గీకరణలు Rh ఫ్యాక్టర్ ఆధారంగా చేయబడతాయి. కానీ Rh-null గ్రూప్‌లో ఆ యాంటీజన్‌లు అన్నీ లేవు. ఇది చాలా అరుదైన పరిస్థితి.

ఈ రక్త గ్రూప్ ఎంత అరుదైనది?

♦ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు గోల్డెన్ బ్లడ్ ఉన్నవారిగా గుర్తించబడిన వారు కేవలం 50 మందికే పరిమితం.

♦ తొలిసారిగా 1961లో ఆస్ట్రేలియాలో ఓ మహిళ వద్ద ఈ రక్త గ్రూప్ కనిపించింది.

♦ భారత్‌లో ఇదే రక్త గ్రూప్ కలిగిన వ్యక్తిని 2022లో గుజరాత్‌లో గుర్తించారు.

గోల్డెన్ బ్లడ్ ప్రత్యేకతలు

♦ విశ్వదాత: గోల్డెన్ బ్లడ్‌ను ఇతర రక్త గ్రూప్‌లకు ఇచ్చేయొచ్చు. అంటే ఇది యూనివర్సల్ డోనర్ లాగా పనిచేస్తుంది.

♦ అత్యంత విలువైనది: ఈ రక్తాన్ని కావలసిన సందర్భాల్లో సంపాదించడం చాలా కష్టం. దాతలు తక్కువగా ఉండడం వల్ల అత్యవసర పరిస్థితుల్లో ఇది అసాధారణంగా విలువైనదిగా మారుతుంది.

♦ ఆరోగ్య రంగంలో కీలకం: ఇది కొన్ని ప్రత్యేక ఔషధాలు తయారీలో, రక్త సంబంధిత వ్యాధుల పరిశోధనల్లో ఉపయోగపడుతుంది.

సమస్యలు ఏమిటి?

గోల్డెన్ బ్లడ్ కలిగిన వ్యక్తులకు రక్త దానం అవసరమైతే, అదే గ్రూప్ ఉన్నవారి నుంచి మాత్రమే తీసుకోవాలి.

♦ అందువల్ల వీరికి అవసరమైన సమయంలో రక్తం దొరకడం చాలా క్లిష్టం.

Show Full Article
Print Article
Next Story
More Stories