ఆ బ్లడ్ చాల డేంజర్!

ఆ బ్లడ్ చాల డేంజర్!
x
Highlights

ప్రపంచంలోనే అతికొద్ది మందిలో మాత్రమే ఉండే 'బ్లడ్ గ్రూప్‌' బాంబే బ్లడ్ గ్రూప్. కానీ.. అంతకంటే అరుదైన మరో రక్త గ్రూపు ఉంది. చాల తక్కువ మందిలో ఉండే రక్త...

ప్రపంచంలోనే అతికొద్ది మందిలో మాత్రమే ఉండే 'బ్లడ్ గ్రూప్‌' బాంబే బ్లడ్ గ్రూప్. కానీ.. అంతకంటే అరుదైన మరో రక్త గ్రూపు ఉంది. చాల తక్కువ మందిలో ఉండే రక్త గ్రూపు 'గోల్డెన్ బ్లడ్'.. 'గోల్డెన్' ఆ పేరులోనే అర్థమైపోతుంది అది ఎంత ప్రత్యేకమో. ఈ రక్తం కలిగిన వారు ఇతరులకు రక్తాన్ని ఇవ్వొచ్చు. కానీ, వారికి రక్తం అవసరమైనప్పుడు మాత్రం దాతలు దొరకటం చాల కష్టం.

సాధారణంగా ఎక్కువగా ఉండే గ్రూపులు ఏ, బీ, ఎబీ, ఓ రక్తం. 'ఏ' గ్రూపు రక్తంలో యాంటీజెన్ ఏ ఉంటుంది. 'బీ' గ్రూపు రక్తంలో యాంటీజెన్ బీ, ఏబీ గ్రూపు రక్తంలో ఏ, బీ రెండు యాంటీజెన్లు ఉంటాయి. ఓ గ్రూపులో ఏ, బీ రెండూ ఉండవు. అలాగే, ఎర్ర రక్త కణాలు 61 Rh- రకానికి చెందిన RhD అనే మరో యాంటీజెన్‌ను కూడా కలిగి ఉంటాయి. రక్తంలో RhD ఉంటే + (పాజిటివ్), లేకుంటే - (నెగెటివ్) అంటారు. Rh null అనే అరుదైన గ్రూపు రక్తంలోని ఎర్ర రక్త కణాల్లో Rh యాంటీజెన్ ఉండదు. గోల్డెన్ బ్లడ్ గ్రూపు అసలు పేరు Rh null.

ఈ బ్లడ్ గ్రూపును తొలిసారిగా 1961లో ఆస్ట్రేలియాకు చెందిన మహిళలో గుర్తించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రపంచంలో 43 మందిలో మాత్రమే ఈ రక్తం ఉండటం విశేషం. ఈ రక్తం ప్రపంచంలో అత్యంత విలువైనది. మరో విశేషం ఎంటంటే ఈ రక్తం ప్రపంచంలోనే అత్యంత ప్రమాదమైనది కూడా. ఎందుకంటే, ఈ రక్తం కలిగిన వారికి రక్తం అవసరమైనప్పుడు దాతలు దొరకడం కష్టం. ఏ దేశంలో ఎక్కడ ఈ రక్తం కలిగిన వారు ఉన్నారో వెతికిపట్టుకోవడం కష్టం. ఒకవేళ దాత దొరికినా అరుదైన తమ రక్తాన్ని దానం చేసేందుకు వాళ్లు ముందుకు రాకపోవచ్చు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories