Mutton: మేక మాంసం vs గొర్రె మాంసం రెండిటిలో ఎందులో ఔషధ గుణాలు ఎక్కువ?

Goat Meat vs Lamb Meat
x

Mutton: మేక మాంసం vs గొర్రె మాంసం రెండిటిలో ఎందులో ఔషధ గుణాలు ఎక్కువ?

Highlights

Mutton Benefits: మేక లేదా గొర్రె మాంసం రెండిటిలో ఏది బెట్టర్‌. ఎందులో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి తెలుసుకుందాం.

Mutton Benefits: ఆదివారం వచ్చిందంటే ముక్క, సుక్క ఉండాల్సిందే. ఈ నేపథ్యంలో చికెన్ లేదా మటన్ వంటివి తీసుకుంటారు. చేపలు తినే వారు కూడా ఉన్నారు. అయితే బర్డ్‌ ఫ్లూ కారణంగా ఈ మధ్య కాలంలో చికెన్ వినియోగం తగ్గింది. మటన్ ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. వీటి ధరలు కూడా ఆకాశాన్ని అంటాయి. అయితే మేక లేదా గొర్రె ఈ రెండిటిలో ఔషధ గుణాలు ఎందులో ఎక్కువగా ఉంటాయి.

మేక లేదా గొర్రె రెండు వేరువేరు రుచిని కలిగి ఉంటాయి. దీని ధర కూడా ఎక్కువ. మేకలోని పూర్తి భాగాలను తినే వాళ్లు కూడా ఉన్నారు. వీటి బొక్కలు, బోటీ, లివర్ మొత్తం తీసుకుంటారు. అయితే, మటన్ ఎంత ధర అయినా కనీసం వారంలో ఒకసారైనా తినాలని కోరుకుంటారు. ప్రధానంగా నాన్‌ వెజ్‌ ప్రియులకు మటన్ అంటే ఎంతో ఇష్టం.

గొర్రె మాంసంలో ఐరన్, జింక్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు ఇందులో విటమిన్ బి12 కూడా ఉంటుంది. ఇది ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తుంది. కండరాల అభివృద్ధి కూడా తోడ్పడుతుంది. గొర్రె మాంసంలో ప్రోటీన్ కూడా పుష్కలం.

అంతే కాదు ఇది కొల్లాజెన్‌ ఉత్పత్తికి తోడ్పడే గుణాలు ఉంటాయి. మేక బొక్కలతో షేర్వా చేసుకుని తయారు చేసుకుంటారు. ఇది ఎముక ఆరోగ్యానికి తోడ్పడుతుంది. అంతే కాదు మేక బోటీ ఎంతో ముఖ్యమైనది. ఇది కడుపు సమస్యలను తగ్గిస్తుంది. జీర్ణ ఆరోగ్యానికి మంచిది. ఇందులో విటమిన్ బీ12 ఉంటుంది. ఎర్ర రక్త కణాలు ఉత్పత్తికి తోడ్పడుతుంది.

ఇది కూడా ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తుంది. అయితే బోటి మాంసంలో కూడా కండరాల అభివృద్ధికి తోడ్పడుతుంది. ఇందులో గొర్రెతో పోలిస్తే కొవ్వు తక్కువగా ఉంటుంది. బోటి తీసుకోవడం వల్ల ప్రోటీన్ కూడా మన శరీరానికి అందుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories