Toddy: పిల్లలకు కల్లు తాపిస్తున్నారా? ప్రేమతో చేసే ఈ పని ప్రాణాంతకం కావచ్చు.. డాక్టర్ల హెచ్చరిక!

Toddy
x

Toddy: పిల్లలకు కల్లు తాపిస్తున్నారా? ప్రేమతో చేసే ఈ పని ప్రాణాంతకం కావచ్చు.. డాక్టర్ల హెచ్చరిక!

Highlights

Giving Toddy (Kallu) to Children: పిల్లలకు కల్లు తాపించడం వల్ల కలిగే ప్రమాదాలపై డాక్టర్ సుమంత్ హెచ్చరిక. కల్లు తాగితే పిల్లలకు ఫిడ్స్ ఎందుకు వస్తాయి? ఆల్కహాల్ శాతం ఎంత ఉంటుంది? పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

Giving Toddy (Kallu) to Children: మన తెలుగు రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో ఒక అలవాటు ఉంది. పిల్లలు ఏడుస్తున్నారని లేదా బొద్దుగా తయారవుతారనే నమ్మకంతో పెద్దలు తమతో పాటు తెచ్చుకున్న కల్లును పిల్లలకు తాపిస్తుంటారు. ఇది సహజమైన పానీయం అని, చెట్టు నుంచి వచ్చిందే కదా అని చాలామంది భావిస్తారు. కానీ, ఈ అలవాటు పిల్లల ప్రాణాల మీదకు తెస్తుందని వరంగల్‌కు చెందిన ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ పసునూతి సుమంత్ హెచ్చరిస్తున్నారు.

కల్లులో ఆల్కహాల్ ఉంటుందా? చాలామంది కల్లును ఆల్కహాల్‌గా పరిగణించరు. కానీ డాక్టర్ సుమంత్ దీనికి శాస్త్రీయ వివరణ ఇచ్చారు:

చెట్టు నుండి కల్లు చుక్క బయటకు రాగానే ఫర్మెంటేషన్ (పులియబెట్టే ప్రక్రియ) మొదలవుతుంది.

♦ కేవలం 1-2 గంటల్లోనే ఇందులో 0.5% నుండి 2% వరకు ఆల్కహాల్ చేరుతుంది.

♦ సాయంత్రం కల్లా ఈ శాతం 4% - 5% వరకు పెరుగుతుంది. అంటే ఇది దాదాపు ఒక బీరుతో సమానమైన మత్తును ఇస్తుంది.

పిల్లల లివర్‌పై ప్రభావం: పెద్దవారి లివర్‌కు ఆల్కహాల్‌ను తట్టుకునే శక్తి ఉంటుంది. కానీ పిల్లల లివర్ ఇంకా పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందదు.

1. ఎంజైమ్స్ లేకపోవడం: ఆల్కహాల్‌ను అరిగించుకునే ఎంజైమ్స్ పిల్లల కాలేయంలో ఉండవు.

2. గ్లూకోజ్ ఉత్పత్తి నిలిపివేత: కల్లు తాగించినప్పుడు, పిల్లల లివర్ ఆల్కహాల్‌ను ప్రాసెస్ చేయలేక శరీరానికి అవసరమైన గ్లూకోజ్ తయారీని నిలిపివేస్తుంది.

ఫిడ్స్ (సీజర్స్) వచ్చే ప్రమాదం: రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పడిపోవడాన్ని 'హైపోగ్లైసీమియా' అంటారు. శరీరంలో గ్లూకోజ్ తగ్గిపోవడం వల్ల మెదడుకు శక్తి అందదు. దీనివల్ల పిల్లలకు హైపోగ్లైసమిక్ సీజర్స్ (ఫిడ్స్) వస్తాయి. మూడు నెలల పసిపిల్లలకు కూడా కల్లు తాగించి, ఫిడ్స్ వచ్చిన కేసులు చూశానని డాక్టర్ సుమంత్ ఆవేదన వ్యక్తం చేశారు.

ముఖ్య గమనిక: పిల్లలకు కల్లు తాపడం ఆరోగ్యానికి మంచిదనేది కేవలం అపోహ మాత్రమే. ఇది వారి మెదడు ఎదుగుదలపై, కాలేయంపై తీవ్ర ప్రభావం చూపుతుంది.



Show Full Article
Print Article
Next Story
More Stories