కొవ్వుతో బాధపడుతున్నారా..!

కొవ్వుతో బాధపడుతున్నారా..!
x
Highlights

అధిక కొవ్వుతో బాధపడేవారి సంఖ్య ఈ కాలంలో చాలా మంది ఉన్నారు. ఏది తిన్నా చాలు.. కొవ్వు అంతా పొట్ట, నడుము దగ్గర చేరిపోతుంటుంది. వాకింగ్ లాంటివి చేసినా...

అధిక కొవ్వుతో బాధపడేవారి సంఖ్య ఈ కాలంలో చాలా మంది ఉన్నారు. ఏది తిన్నా చాలు.. కొవ్వు అంతా పొట్ట, నడుము దగ్గర చేరిపోతుంటుంది. వాకింగ్ లాంటివి చేసినా కూడా కొంతమందికి ప్రతిఫలం పెద్దగా ఉండదు. అయితే.. అలాంటి వారు కొన్ని చిట్కాలు పాటిస్తే ప్రయోజనం ఉండొచ్చు అంటున్నారు నిపుణులు. సాధారణంగా పొట్ట, తొడల్లోనే ఎక్కువగా కొవ్వు పేరుకుంటూ ఉంటుంది. ఈ కొవ్వును కరిగించడానికి పాటించే ఆహార నియమాల్లో అల్లం నీళ్లు తీసుకుంటే మంచిది అంటున్నారు నిపుణులు.

అల్లం నీళ్లు శరీరంలోని విషాలను బయటకు వెళ్లగొడుతుంది. అలాగే మెటబాలిజంను పెంచుతాయి. అధిక కొలెస్ట్రాల్‌ కారణంగా తలెత్తే వ్యాధుల నుంచి కాపాడుతుంది. అలాగే రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. రక్తనాణాల్లో రక్తం గడ్డలు కట్టకుండా నియంత్రించే శక్తి అల్లం నీళ్లకు ఉందంటున్నారు నిపుణులు. అల్లం నీళ్లకు కీళ్ల నొప్పుల నుంచి ఉపసనం కల్గించే శక్తి ఉందట. కొన్ని రకాల కేన్సర్లు రాకుండా చేయడంలో కూడా అల్లం నీళ్లు అద్భుతంగా పని చేస్తాయి అంటున్నారు.

అయితే అల్లం నీళ్లని ఎలా తీసుకోవాలంటే.. 100 గ్రాముల అల్లం సన్నగా తరగాలి. 5 లీటర్ల నీళ్లు, నిమ్మరసం కొద్దిగా తీసుకోవాలి. ముందుగా నీళ్లలో అల్లం ముక్కలు వేసి మరిగించాలి. తరువాత చల్లార్చి వడగట్టి, నిమ్మరసం కలుపుకోవాలి. ఇలా చేసిన అల్లం నీళ్లని ప్రతి రోజూ ఉదయం టిపెన్ చేయటానికి ముందు, రాత్రి భోజనానికి ముందు తాగుతూ ఉంటే మంచి ఫలితం వస్తుందంటున్నారు నిపుణులు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories