Lifestyle: నెయ్యి తింటున్నారా.? అయితే ముందు ఈ విషయాలు తెలుసుకోండి

Ghee Side Effects Who Should Avoid Ghee for Better Health
x

Lifestyle: నెయ్యి తింటున్నారా.? అయితే ముందు ఈ విషయాలు తెలుసుకోండి

Highlights

Lifestyle: నెయ్యి ఆరోగ్యానికి మేలు చేస్తుందని తెలిసిందే. అందుకే పెద్దలు కూడా నెయ్యిని తీసుకోమని చెబుతుంటారు.

Lifestyle: నెయ్యి ఆరోగ్యానికి మేలు చేస్తుందని తెలిసిందే. అందుకే పెద్దలు కూడా నెయ్యిని తీసుకోమని చెబుతుంటారు. ముఖ్యంగా రోగనిరోధక శక్తి పెంచడంతో పాటు జీర్ణక్రియ, చర్మ ఆరోగ్యం, శక్తి పెంపు వంటి విషయాల్లో సహాయపడుతుంది. అయితే ఆరోగ్యానికి మేలు చేసే నెయ్యి కొందరికి మాత్రం అస్సలు మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. కొన్ని రకాల అనారోగ్య సమస్యలతో బాధపడేవారు నెయ్యికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇంతకీ ఆ సమస్యలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

* నెయ్యిలో ఉండే సంతృప్త కొవ్వు చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిని పెంచుతుంది. ఇది గుండె సంబంధిత సమస్యలకు దారితీయవచ్చు. అందుకే వైద్యుల సూచనలు తీసుకున్న తర్వాతే నెయ్యిని ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

* నెయ్యిలో కేలరీలు అధికంగా ఉంటాయి. ఊబకాయంతో ఉన్నవారు దీనిని ఎక్కువగా తీసుకుంటే బరువు మరింత పెరగవచ్చు. ఇది డయాబెటిస్, హై బీపీ వంటి సమస్యలకు దారితీయవచ్చు.

* నెయ్యి కాలేయంపై భారం పెడుతుంది. ఫ్యాటీ లివర్ ఉన్నవారు దీన్ని తీసుకుంటే సమస్యలు మరింత తీవ్రతరం అవుతాయి. నెయ్యిని పూర్తిగా నివారించటం మంచిది.

* నెయ్యి కొంతమందికి జీర్ణం కావడం కష్టం. దీనివల్ల అజీర్ణం, గ్యాస్, ఆమ్లత్వం వంటి సమస్యలు తలెత్తవచ్చు. కడుపు సమస్యలు ఉన్నవారు దీన్ని తక్కువగా తీసుకోవాలి లేదా నివారించాలి.

* నెయ్యి చక్కెరను నేరుగా పెంచదు కానీ అధికంగా తీసుకుంటే బరువు పెరగడం, ఇన్సులిన్ నిరోధకత వంటి సమస్యలు రావచ్చు. అందువల్ల నెయ్యిని పరిమితంగా తీసుకోవడం మంచిది. డయాబెటిస్‌ ఉన్న వారికి నెయ్యికి దూరంగా ఉండడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు.

* గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు నెయ్యిని తీసుకోవాలంటే ముందుగా వైద్యుడి సలహా తీసుకోవాలి. ఇది ట్రైగ్లిసరైడ్స్‌, కొలెస్ట్రాల్ స్థాయిలపై ప్రభావం చూపవచ్చు. వీలైనంత వరకు గుండె జబ్బుల బారిన పడిన వారు నెయ్యిని తక్కువగా తీసుకోవడమే మంచిది.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

Show Full Article
Print Article
Next Story
More Stories