బాబోయ్.. ఒక్క ఇంజక్షన్ ఖరీదు మరీ ఇంతా..?

బాబోయ్.. ఒక్క ఇంజక్షన్ ఖరీదు మరీ ఇంతా..?
x
Highlights

ఒక్క ఇంజక్షన్ ఖరీదు అక్షరాలా రూ.14 కోట్ల 57 లక్షలు.. బాబోయ్ మరీ ఇంత అనుకుంటున్నారా..! వచ్చిన జబ్బు కంటే.. ఇంజక్షన్ ఖరీదు వింటేనే రోగి గుండె...

ఒక్క ఇంజక్షన్ ఖరీదు అక్షరాలా రూ.14 కోట్ల 57 లక్షలు.. బాబోయ్ మరీ ఇంత అనుకుంటున్నారా..! వచ్చిన జబ్బు కంటే.. ఇంజక్షన్ ఖరీదు వింటేనే రోగి గుండె ఆగిపోతుందుమౌ అనేంతగా ఉంది. జోల్‌జెన్‌స్మా అనే ఇంజెక్షన్‌‌ని తీసుకోవాలంటే ఆ మాత్రం ఖర్చు అవుతుంది అంటోంది స్విట్జర్లాండ్‌కి చెందిన మందుల తయారీ కంపెనీ.

ఇంతకీ ఎందుకంత రేటు అంటే.. పుట్టిన పిల్లల్లో కొన్ని సార్లు జన్యులోపాలు వస్తాయట. అలాంటి లోపాలను మొదట్లోనే అంతం చేయాలట.. లేకపోతే జీవితాంతం అవి వారిని ఇబ్బంది పెడుతుంటాయి అంటున్నారు వైద్యులు. జన్యు లోపాలతో పుట్టిన కొందరు పిల్లలు రెండేళ్లలోనే చనిపోతుంటారట. ఇలాంటి లోపాల్ని సరిచేయడం కష్టంతో కూడుకున్న పని. అందుకే ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న స్విట్జర్లాండ్‌కి చెందిన మందుల తయారీ కంపెనీ నోవార్టిస్ ఈ ఇంజెక్షన్‌ని తయారు చేస్తోంది.

జోల్‌జెన్‌స్మా ఇంజెక్షన్ ఇస్తే పిల్లల్లో జన్యులోపాలు తొలగిపోతాయని వైద్యులు చెబుతున్నారు. ఈ లోపాన్ని సరి చేయడానికి మార్కెట్లో అనేక రకాల మందులున్నాయి. అయితే వాటిని ప్రతిసంవత్సరం ఇవ్వాల్సి ఉంటుంది. దాదాపు పదేళ్ల పాటు వాటిని ఇవ్వాల్సి ఉంటుంది. అందుకోసం రూ.30 కోట్లు వరకు ఖర్చవుతుంది. అదే జోల్‌జెన్‌స్మా అయితే అలా కాదట.. ఒక్కసారి ఈ ఇంజెక్షన్ ఇస్తే చాలు.. మళ్లీ ఇవ్వక్కరలేదంటున్నారు నిపుణులు.

Show Full Article
Print Article
Next Story
More Stories