వెల్లుల్లితో ఆరోగ్యం మెరుగు..

వెల్లుల్లితో ఆరోగ్యం మెరుగు..
x
Highlights

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయలేదంటారు..అలాంటి ఉల్లికంటే మేలు చేసేది వెల్లుల్లి... ఇందులో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. ఎన్నో పోషకాల గణి...

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయలేదంటారు..అలాంటి ఉల్లికంటే మేలు చేసేది వెల్లుల్లి... ఇందులో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. ఎన్నో పోషకాల గణి వెల్లుల్లి. ఇది వంటలకు రుచినే కాదు...ఆరోగ్యానికి ఔషధంగా పనిచేస్తుంది. వెల్లుల్లిని పచ్చిగా తిన్నా ఆహారంలో భాగంగా తీసుకున్నా ఎన్నో లాభాలు ఉన్నాయి. వెల్లుల్లి అనారోగ్యాలను దరిచేరనివ్వవు.

ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు పుష్కలంగా వెల్లుల్లిలో ఉండటం వల్ల దీనిని నిరంతరం తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వెల్లుల్లి చర్మ సౌదర్యాన్ని కాపాడటంలో క్రీయాశీలంగా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. చర్మం నిండా మొటిమలు ఉన్నా, మచ్చలు ఉన్నా వాటి నుంచి ఉపశమనం పొందవచ్చంటున్నారు. వెల్లుల్లి రెబ్బల రసాన్ని ఉదయమే దాగితే చక్కటి ఫలితం ఉంటుందని చర్మం కూడా కాంతివంతంగా తయారవుతుంది.

కడుపు ఉబ్బరం మనిషిని కిందా మీద పడేస్తుంద.అలాంటి సమస్యతో బాధపడేవారు ఇన్‌స్టంట్‌ మందులను వాడకుండా దీర్ఘకాలిక చికిత్స అవసరం..అదీ పూర్తి ఇంటిదైతే ఇంకా మంచిది. అందుకే రోజూ ఉదయం వెల్లుల్లిని తింటే చక్కటి పరిష్కారం లభిస్తుంది. పచ్చి వెల్లుల్లిని తినడం కష్టమనుకున్నవారు తేనెతో కలిపి తిన్నా మంచి ఫలితమే ఉంటుంది.

పైకి మనం ఆరోగ్యంగా కనిపించిన లోపల ఎన్నో రకాల సూక్ష్మక్రిములు, ఆనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి..అవి ఎప్పుడో కానీ బయటపడవు..అందుకే శరీరంలోని రక్తాన్ని శుద్ధి చేసేందుకు వెల్లులిని తీసుకుంటూ ఉండాలి..తద్వారా రక్తం శుద్ధి కావడంతో పాటు శరీరంలో సూక్ష్మక్రిములు నశించి ఆరోగ్యం మీ సొంతం అవుతుంది.

శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ని అనవసరమైన కొవ్వు పదార్ధాలను వెల్లుల్లి పారద్రోలుతుంది. దీని వల్ల బరువును కూడా తగ్గించుకోవచ్చు. బరువు తగ్గాలనుకునే వారు ప్రతి రోజు ఉదయం పరగడుపున తేనెలో నానబెట్టిన వెల్లుల్లి రెబ్బలను తీసుకుంటూ ఉండాలి చక్కటి ప్రయోజనం ఉంటుంది.

దగ్గు, జలుబు, తుమ్ములు, అలర్జీలతో సతమతమయ్యేవారికి వెల్లుల్లి మంచి మెడిసిన్. వెల్లుల్లి రసంలో యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు ఉండడం చేత అలర్జీలను తరిమికొడుతుంది. రక్తపోటుతో బాధపడేవారు వెల్లుల్లి రసాన్ని తీసుకోవచ్చు. గుండె సమస్యలకు దరంగా ఉండాలంటే ఈ వెల్లుల్లి దివ్య ఔషధం

Show Full Article
Print Article
More On
Next Story
More Stories