Fridge care: ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ఫ్రిజ్ బాంబులా పేలిపోయే ప్రమాదం ఉంది

Fridge care
x

Fridge care: ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ఫ్రిజ్ బాంబులా పేలిపోయే ప్రమాదం ఉంది

Highlights

Fridge Care: సీజన్‌తో సంబంధం లేకుండా ఉపయోగించే వస్తువు ఏదైనా ఉందంటే అది ఫ్రిజ్. ప్రిజ్ అనేది అత్వవసరమైన వస్తువు.

Fridge Care: సీజన్‌తో సంబంధం లేకుండా ఉపయోగించే వస్తువు ఏదైనా ఉందంటే అది ఫ్రిజ్. ప్రిజ్ అనేది అత్వవసరమైన వస్తువు. అయితే దీన్ని సరైన పద్దతిలో ఉపయోగించకపోతే ఫ్రిజ్ బాంబులా పేలిపోయే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.

సాధారణంగా ఫ్రిజ్ ముందు చల్లగా ఉండాలంటే వెనక భాగంలో వేడెక్కాలి. ఇది సహజం. అయితే కొన్ని కారణాల వల్ల ఫ్రిజ్ వెనకాల భాగంలో మరింత వేడి వస్తూ ఉంటుంది. దీనివల్ల ఫ్రిజ్ పేలిపోయే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో ఉరుములుమెరుపులతో కూడిన వానలు వస్తాయి. ఇలాంటి సమయంలో ఫ్రిజ్‌ స్విచ్ ఆఫ్ చేయాలి. లేకపోతే ప్రిజ్ పేలిపోయే ప్రమాదం ఉంది.

పేలుడు ఎందుకు సంభవిస్తుంది?

ఫ్రిజ్‌లో ప్రధానంగా పేలుడు దాని కంప్రెషర్ వల్ల సంభవిస్తుంది. యూనిట్ వెనుక భాగంలో ఉండే ఈ కంప్రెషర్ ఎప్పుడు హీట్‌గా ఉంటుంది. ఇది పంప్, మోటారును కలిగి ఉంటుంది. కాయిల్ ద్వారా కూలింగ్ గ్యాస్‌ను నెట్టేస్తుంది. ఈ వాయువే ధ్రవంగా మారి వేడిని గ్రహించి వస్తువులను కూల్‌గా ఉంచుతుంది. అయితే కొన్ని సార్లు ఏం జరుగుతుందంటే ఫ్రిజ్ వెనుక భాగం వేడేక్కుతోంది. దాంతో కంటైనర్స్ కాయిల్ కుంచించుకుపోవడం స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాతే కంప్రెసర్ కాయిల్‌లో ఎక్కువ గ్యాస్ పేరుకుపోయి ఒత్తిడి పెరిగిపోతుంది. దీంతో భారీ పేలుడు సంభవిస్తుంది.

మరి ఏం చేయాలి?

8 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం అయిన ఫ్రిజ్‌లను అతి తొందరగా తీసేయడం మంచిది. ఎందుకంటే ఇలాంటి ఫ్రిజ్‌లలోనే పేలుళ్లు ఎక్కువ జరిగే ఛాన్స్ ఉంది. అంతేకాదు ఇలాంటి ప్రమాదం జరగకుండా ఉండాలంటే కంప్రెసర్ కాయిల్ మూసుకోకుండా శుభ్రం చేసుకోవాలని చెబుతున్నారు. అంతేకాదు దీనితో పాటు ఫ్రిజ్ ఎటువంటి సమస్య వచ్చిన వెంటనే దానికి సంబంధించిన వ్యక్తికి చూపించండి. ఒక వేళ సమస్య మీకు కనిపించిన వెంటనే దాని స్విచ్ ఆఫ్ చేసి అన్ ప్లగ్ చేయాలి. అంతేకాదు ముఖ్యంగా వర్షాకాలం సమయంలో ఉరుములుమెరుపులు సంభవిస్తాయి. ఇలాంటి సమయంలో ఫ్రిజ్‌ స్విచ్ ఆఫ్ చేయాలి. లేకపోతే ప్రిజ్ పేలిపోయే ప్రమాదం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories