కాలి మడమలపై పగుళ్లు ఇబ్బంది పెడుతున్నాయా..!

కాలి మడమలపై పగుళ్లు ఇబ్బంది పెడుతున్నాయా..!
x
Highlights

వాతవరణంలో వచ్చే మార్పులు.. మన చర్మ సమస్యలకు కారణం అయ్యే ప్రమాదం ఉంది. ముఖ్యంగా కాలంలో వచ్చే మార్పుల వల్ల చర్మం చాలా సమస్యల్ని ఎదుర్కొంటుంది. అందులో...

వాతవరణంలో వచ్చే మార్పులు.. మన చర్మ సమస్యలకు కారణం అయ్యే ప్రమాదం ఉంది. ముఖ్యంగా కాలంలో వచ్చే మార్పుల వల్ల చర్మం చాలా సమస్యల్ని ఎదుర్కొంటుంది. అందులో పాదాలు పగలటం ఓ సమస్య. ఎక్కువ మహిళలలో ఈ సమస్య కనిపిస్తు ఉంటుంది.

పాదాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే.. వర్ష కాలం మరియు చలి కాలంలో కాలి మడమలపై పగుళ్లు వచ్చి సమస్య మరింత పెరుగుతుంది. అదే డయాబెటిస్ ఉన్నవారికైతే ఈ సమస్య వచ్చినప్పుడు అదే తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. ఈ కాలంలో పాదాలను జాగ్రత్తగా ఉంచుకోడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

పాదాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయంటున్నారు నిపుణులు.

* ప్రతిరోజూ పాదాలను చల్లటి నీళ్లతో కాకుండా గోరువెచ్చటి నీటితో కడుక్కోవాలి. పాదాలను, వేళ్ల మధ్య ఎప్పుడూ పొడిగా ఉంచుకోవాలి.

* రోజూ పాదాలను జాగ్రత్తగా పరిశీలించుకోవాలి.. కాలి బొటనవేలి గోరును జాగ్రత్తగా కట్ చేసుకోవాలి.

* పాదరక్షలు సరిగ్గా సరిపోయేలా ఉండేలా చూసుకోవాలి.

* షూస్ ధరించేవారు బూట్లలో ఏదైనా ఉన్నట్లు స్పర్శకు తెలిస్తే వెంటనే బూట్లు తొలగించి ఆ వస్తువును తొలగించాకే మళ్లీ వేసుకోవాలి.

* చెప్పులు లేకుండా నడవకూడదు. ముఖ్యంగా గులకరాళ్లు ఉన్న చోట నగ్న పాదాలతో అస్సలు నడవకూడదు.

* పాదాలపై వేడినీళ్లు గుమ్మరించుకోకూడదు.

* ఉతకని సాక్స్ ఎక్కువరోజుల పాటు వేసుకోవటం అంత మంచిది కాదు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories