Health: జ్వరం వచ్చినప్పుడు వీటికి దూరంగా ఎందుకు ఉండాలో తెలుసా.?

Foods to Avoid During Fever and Their Impact on Recovery
x

Health: జ్వరం వచ్చినప్పుడు వీటికి దూరంగా ఎందుకు ఉండాలో తెలుసా.?

Highlights

Health: జ్వరం వచ్చిన సమయంలో తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకోవాలని వైద్యులు చెబుతుంటారు.

Health: జ్వరం వచ్చిన సమయంలో తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకోవాలని వైద్యులు చెబుతుంటారు. ముఖ్యంగా కొన్ని రకాల పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలని అంటుంటారు. ఇంతకీ జ్వరం వచ్చిన సమయంలో ఎలాంటి ఫుడ్స్‌కి దూరంగా ఉండాలి.? దీని వెనకాల ఉన్న అసలు కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

* జ్వరం ఉన్నప్పుడు పాలు, చీజ్, పెరుగు వంటి పాల ఉత్పత్తులను తీసుకోవద్దని నిపుణులు చెబుతుంటారు. ఇవి మ్యూకస్ ఉత్పత్తిని పెంచి శ్వాసకోశ వ్యవస్థపై ఒత్తిడి పెంచుతాయి.

* అలాగే చక్కెర అధికంగా ఉండే ఆహారాలు రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తాయి. ఈ కారణంగా శరీరంలో వాపులు ఏర్పడి ఇన్‌ఫెక్షన్ పెరుగుతుంది.

* ఇక జ్వరం వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో నాన్‌ వెజ్‌ తినకూడదని నిపుణులు చెబుతుంటారు. ఇది జీర్ణవ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. దీనివల్ల అజీర్తి, గ్యాస్, విరేచనాల సమస్యలు పెరిగే అవకాశం ఉంది.

* జ్వరం ఉన్న సమయంలో నిమ్మ, మోసంబి వంటి పండ్లకు దూరంగా ఉండాలి. సిట్రస్‌ జాతి పండ్లలో ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ఇవి గొంతు, పొట్టలో అసౌకర్యం కలిగించవచ్చు.

* అదే విధంగా కెఫీన్ అధికంగా ఉండే టీ, కాఫీ నిద్రను భంగం కలిగించవచ్చు. మద్యం డీహైడ్రేషన్‌కు దారితీస్తుంది. ఇవి శరీర ఉష్ణోగ్రతను పెంచి ఆరోగ్య సమస్యలను మరింత తీవ్రతరం చేస్తాయి.

* జ్వరం వచ్చిన సమయంలో నూనె పదార్థాలు, వేయించిన వంటకాలు, ప్రాసెస్ చేసిన ఆహారాలు జీర్ణవ్యవస్థను ఒత్తిడికి గురిచేస్తాయి. కాబట్టి, ఇవన్నీ పూర్తిగా మానేయడం మంచిది.

* అనారోగ్యంగా ఉన్న సమయంలో వీలైనంత వరకు ద్రవ రూపంలో ఆహారాన్ని తీసుకోవాలి. అందుకే వైద్యులు ఓఆర్‌ఎస్‌, మజ్జిగ వంటివి తీసుకోవాలని చెబుతుంటారు. త్వరగా జీర్ణమయ్యే తేలికపాటు ఫుడ్‌ను ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు.

గమనిక: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యపరమైన ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు, తప్పకుండా వైద్యుల సూచనలు తీసుకోవాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories