సమతుల్య ఆహారంతో డిప్రెషన్ దూరం

సమతుల్య ఆహారంతో డిప్రెషన్ దూరం
x
Highlights

మానసిక కుంగుబాటుకు మన చూట్టూ ఉన్న పరిస్ధితులే కాకుండా ఆహారం కూడా ప్రభావం చూపుతుందని తాజా పరిశోధనల్లో వెల్లడైంది. ఈ ఆంశంపై పరిశోధన జరిపిన స్పానిష్‌...

మానసిక కుంగుబాటుకు మన చూట్టూ ఉన్న పరిస్ధితులే కాకుండా ఆహారం కూడా ప్రభావం చూపుతుందని తాజా పరిశోధనల్లో వెల్లడైంది. ఈ ఆంశంపై పరిశోధన జరిపిన స్పానిష్‌ పరిశోధనకులు ఈ విషయాన్ని వెల్లడించారు. మనం తీసుకునే ఆహారంలో ఉండే ఫాట్స్‌, ఆలివ్‌ నూనె లాంటి మోనో సాచురేటెడ్‌ ఫ్యాట్స్‌ సెరటోనిన్‌ అనే న్యూరోట్రాన్స్‌మిటర్‌ హార్మోను ఉత్పత్తి చేయడంలో కీలక పాత్రను పోషిస్తున్నట్లు వివరించారు. సెరటోనిన్‌ హార్మోన్‌ నాడీ కణాలను, మెదడులోని రిసెప్టార్ల మధ్య బంధాన్ని కుదుర్చడంలో ఉపయోగపడుతుంది.

మెుదడు నరాల లోపల పోర కొవ్వు పదార్థాలతో నిర్మితమై ఉంటుంది. అందువల్ల మనం తీసుకునే ఆహరంలో కోవ్వు పదార్ధాలతో కూడి ఉండాలి. శరీర వ్యవస్థ, న్యూరో ట్రాన్స్‌మీటర్ల వ్యవస్థ విటమిన్ల మీదే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. మిటమిన్లతో కూడిన ఆహారం మెుదడు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. విటమిన్‌ బి-6, ఫొలేట్‌ అనేవి కూరగాయలు, పండ్లు, నట్స్‌లల్లో, చిక్కుడు దాన్యాలల్లో విరివిగా దొరుకుతాయి. పాల ఉత్పత్తులు, కోళ్లు, అరటిపండ్లు, ఓట్లు, వీటిలో ఉండే కొవ్వు పదార్థాల్లో దొరికే పోషకాలు సెరటోనిన్ల ఉత్పత్తికి తోర్పాడుతాయి.

మానసిక రుగ్మతలతో బాధపడే ఎక్కువ మందిలో ఫొలేట్‌ తక్కువగా ఉంటాయి. కావున సెరటోనిన్‌ కూడిన ఆహారం ఎక్కువగా తీసుకోవాలి. అయితే బి-విటమిన్‌, ఫోలిక్‌ యాసిడ్‌ డిప్రెషన్‌కు విరుగుడుగా జీవనక్రియల్ని ఉత్తేజితం చేయడంలోనూ ఉపయోగపడుతుంది. అలాగే మనం స్వచ్చమైనదిగా ఉండాలి. ఆక్సీజన్‌ సంబంధిత కారణాలతో కణ విధ్వంసం జరగకుండా చేయడం వల్ల డిప్రెషన్‌కు తావులేకుండా పోతుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories