ఉద్యోగస్తుడిగా మంచి పేరు తెచ్చుకోవాలంటే ఇలా చేయాలి..

ఉద్యోగస్తుడిగా  మంచి పేరు తెచ్చుకోవాలంటే ఇలా చేయాలి..
x
Highlights

ఉద్యోగం చేస్తున్నారంటే మీ లైఫ్‌లో మీరు కొన్నింటిని త్యాగం చేయాల్సి ఉంటుంది. మీ జాబ్ వల్ల మీ వ్యక్తిగత జీవితంలో చాలా మిస్ అవుతూ ఉంటారు. చాలా మంది వర్క్...

ఉద్యోగం చేస్తున్నారంటే మీ లైఫ్‌లో మీరు కొన్నింటిని త్యాగం చేయాల్సి ఉంటుంది. మీ జాబ్ వల్ల మీ వ్యక్తిగత జీవితంలో చాలా మిస్ అవుతూ ఉంటారు. చాలా మంది వర్క్ కు ఇవ్వాల్సిన టైం కంటే ఎక్కవుగా కేటాయిస్తుంటారు. దీనికి కారణం ఆఫీసులో పని చేస్తున్న వాళ్లందర్లో తామే ముందుండాలన్న కోరిక, ప్రత్యేక గుర్తింపు పొందాలన్న ఆశ. అయితే అలా ముందుండాలంటే శ్రమ, త్యాగం మాత్రమే సరిపోవు. కెరీర్లో సక్సెస్ అందుకోవాలంటే కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఎప్పటికప్పుడు పొరపాట్లను సరిచేసుకుంటూ ఉండాలి.

ఆఫీసులో అందరికంటే బెస్ట్ అనిపించుకోవాలనే కొరిక చాలా మందికి ఉంటుంది. అలాంటి వాళ్లు ముందుగా అసలు పోటీ ఎవరితో, ఏ అంశంలో అనే విషయంపై క్లారిటీతో ఉండాలి. పోటీ అనగానే అది సహచరులతోనే ఉండాలని లేదు. విజయం సాధించడానికి మనం చేసే పనిపై శ్రద్ద వహించాలి . పెద్ద విజయాన్ని అందుకునే ముందు చిన్న టాస్క్‌లపై దృష్టి పెట్టి వాటిపై విజయం సాధిస్తే…మీరు అనుకున్న టార్గెట్ త్వరగా, సమర్థంగా పూర్తవుతుంది. అలాగే చుట్టూ జరుగుతున్న మార్పులు ఎప్పటికప్పుడు అర్థం చేసుకోవాలి.

నలుగురిలో ఎప్పుడూ ముందుంటూ… మంచి పేరు తెచ్చుకోవాలంటే అప్ డేట్ అవుతూ ఉండాలి. మనం పని చేస్తున్న రంగంలో ఎలాంటి ఇన్నొవేషన్లు జరుగుతున్నాయో తెలుసుకోవాలి. ఏ రంగంలో పని చేస్తే… ఆ రంగంలో స్నేహితులను పెంచుకుంటూ పోవాలి. దానివల్ల ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందుతాయి. కొత్తకొత్త ఐడియాలతో ఆఫీసులో పని చేస్తే, అందరికంటే ముందుంటూ మంచి పేరు తెచ్చుకుంటారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories