Top
logo

Flax Seeds: పట్టులాంటి చర్మం కోసం అవిసె గింజలు

Flax Seeds for Skin Whitening
X

ఫైల్ ఇమేజ్


Highlights

Flax Seeds: అవిసె గింజ ఎన్నో రకాల రుగ్మతలను నివారించడంలో క్రియాశీలకంగా పనిచేయగల వని ఇటీవలి పరిశోధనలు పేర్కొంటున్నాయి.

FlaxSeed: అవిసె గింజలు ఆంగ్లంలో అలాగే మన తెలుగులో అవిసె గింజలు, మదనగింజలు, ఉలుసులు, అతశి అని కూడా అంటారు అవిసె గింజ ఎన్నో రకాల రుగ్మతలను నివారించడంలో క్రియాశీలకంగా పనిచేయగల వని ఇటీవలి పరిశోధనలు పేర్కొంటున్నాయి. రుచిలో పెద్ద ప్ర‌త్యేక‌త ఏమీ లేక‌పోయినా ఈ గింజ‌ల‌ను మాత్రం సూప‌ర్‌ఫుడ్‌ (Superfood) గా చెప్పుకోవ‌చ్చు. 3000 సంవ‌త్సరాల క్రితం బాబిలోయ‌న్ల కాలంలోనే వీటిని పండించిన‌ట్లు చారిత్ర‌క ఆధారాలున్నాయి. అప్ప‌టి రాజులు కూడా వీటిని ప్ర‌జ‌లు నిత్యం తినే ఆహారంలో భాగంగా మార్చార‌ట‌.ఇందులోని పోష‌కాల గురించి తెలిస్తే రుచి కాస్త తేడాగా ఉన్నా వీటిని రోజూ తినాల‌నుకుంటారు. దీనివ‌ల్ల మ‌న ఆరోగ్యానికే కాదు.. అందానికి కూడా ఎన్నో ప్ర‌యోజ‌నాలున్నాయి. అవేంటే హెచ్ ఎం టివి లైఫ్ స్టైల్ లో చూద్దాం....

అవిసె గింజలు తీసుకునే విధానం...

అవిసె గింజలను 15 నిమిషాలు నానబెడితే మొలకలు వస్తాయి ఈ మొలకలు ఉదయాన్నే తింటే అవిసె గింజల్లో ఉండే పూర్తిస్థాయి పోషకాలు మనకు అందుతాయిగింజలను ఎండబెట్టి పొడిచేసి ఈ పొడిని మనం తీసుకునే ఆహారంలో కూరలు లో గాని మనం తీసుకునే పళ్లరసాలు లేదా లస్సి లో పైన చల్లుకుని త్రాగవచ్చుఅపార ఔషధ సుగుణాల ఉన్న అవిసెగింజల్ని ఆకుకూరలు, కాయగూరలు, చేపలతోపాటు ఆహారంలో చేర్చుకోవాలి. వీటిలో పీచు, ఒమెగా -3 ఫ్యాటీ యాసిడ్స్ అత్యధికంగా ఉంటాయి. వీటిని స్మూథీలు, షేక్స్ లో కలుపుకోవచ్చు. పెరుగు పై జిమ్ముకోవచ్చు లేదా మఫిన్లు, కుకీల్ని బేక్ చేస్తున్నపుడు కలపవచ్చు. ఇందులో మ‌న శరీరానికి అవ‌స‌ర‌మ‌య్యే స్థూల పోష‌కాలైన ప్రొటీన్‌, ఫ్యాట్‌, ఫైబ‌ర్ వంటివి ఎక్కువ‌గా ల‌భిస్తాయి.

పట్టులాంటి చర్మం కోసం..

  • అవిసె గింజ‌ల్లోని ఒమెగా - 3 ఫ్యాటీ ఆమ్లాలు మ‌న చ‌ర్మంపై మంచి ప్ర‌భావాన్ని చూపిస్తాయి. ఇవి చ‌ర్మంపై ఎలాంటి రాషెస్ రాకుండా కాపాడ‌డంతో పాటు ఎరుపుద‌నం, మంటవంటివి రాకుండా చేస్తాయి. చ‌ర్మంపై త‌గిలిన గాయ‌ల‌ను మాన్ప‌డానికి ఇవి తోడ్ప‌డ‌తాయి. అవిసె గింజ‌లు మ‌న చ‌ర్మంలో స‌హ‌జ నూనెలు ఎక్కువ‌గా ఉత్ప‌త్త‌య్యేలా చేస్తాయి. దీనివ‌ల్ల మ‌న చ‌ర్మం మెత్త‌గా, ప‌ట్టులా ఉండ‌డంతో పాటు తేమ కూడా నిండి ఉంటుంది. మ‌న చ‌ర్మం విడుద‌ల చేసే సెబ‌మ్ అనే స‌హ‌జ నూనెలు త‌క్కువ‌గా విడుద‌ల‌య్యేలా చేసి చ‌ర్మం మృదువుగా మారేలా చేస్తాయి. అంతేకాదు.. యాక్నె స‌మ‌స్య‌ను కూడా రాకుండా చేస్తాయి.ఇందుకోసం మీరు చేయాల్సింద‌ల్లా రోజూ ఒక‌టి రెండు టీస్పూన్లు అవిసెగింజ‌ల‌ను తీసుకోవ‌డ‌మే..
  • ఒక తెల్లగుడ్డ సొన లో గుప్పెడు అవిసె గింజలు పొడి వేసి బాగా బీట్ చేసుకోవాలి. ఆ త‌ర్వాత దీన్ని ముఖానికి, మెడ‌కు ప‌ట్టించి ప‌ది నిమిషాల త‌ర్వాత మైల్డ్ ఫేస్‌వాష్ జెల్ తో ముఖం క‌డుక్కోవాలి. ఇవి మీ ముఖానికి తేమ‌ను అందిస్తాయి.
  • అవిసె గింజ‌లు ర‌క్త‌పోటు ముప్పును త‌గ్గిస్తాయి. ర‌క్తనాళాలు పెళుసుగా మార‌డాన్ని ఆప‌డ‌మే కాదు.. ర‌క్త‌నాళాల్లో కొవ్వు పేరుకుపోవ‌డం లేదా ర‌క్తం గ‌డ్డ‌క‌ట్టి ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ‌నుఆప‌డం వంటివి జ‌ర‌గ‌కుండా ఆపుతాయి. అంతేకాదు.. కొలెస్ట్రాల్ కూడా తగ్గిస్తాయి. వీటిని రోజూ తీసుకోవ‌డం వ‌ల్ల కొలెస్ట్రాల్ శాతం చాలా త‌గ్గే వీలుంటుంది.
  • అవిసె గింజ‌ల్లోని ఒమెగా - 3 ఫ్యాటీ ఆమ్లాలు జుట్టులో తేమ‌ను పెంచి సిల్కీగా క‌నిపించేలా చేస్తాయి.అవిసె గింజ‌లు జుట్టుకు మంచి మాయిశ్చ‌రైజేష‌న్‌, పోష‌ణ అందించ‌డం వ‌ల్ల త‌ల కూడా ఎప్పుడూ శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచడంతో పాటు చుండ్రును కూడా నివారిస్తుంది.. బ‌ట్ట‌త‌ల‌కు దారితీసే ఎంజైమ్‌ల‌తో పోరాడి రాకుండా నివారించేందుకు దోహదం చేస్తాయి.
  • రోజూ అవిసె గింజ‌లు తినే డ‌యాబెటిస్ పేషంట్ల‌లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ త‌గ్గ‌డం, ర‌క్తంలో చ‌క్కెర‌ల స్థాయులు అదుపులో ఉండ‌డం గ‌మ‌నించారు పరిశోధ‌కులు. అవిసె గింజ‌ల్లోని యాంటీ ఆక్సిడెంట్లు మ‌న శ‌రీరానికి ర‌క్ష‌క భ‌టుల్లా కాపలా కాస్తాయి. ఇవి మ‌న‌కు ప్రొస్టేట్‌, పెద్ద‌పేగు, రొమ్ము క్యాన్స‌ర్లు రాకుండా మ‌న‌ల్ని కాపాడ‌తాయి.
  • అవిసె గింజ జీవక్రియ రేటును పెంచి,. శరీరంలో శక్తి జనించేందుకు దోహదం చేస్తాయి. దీనివలన శరీరంలో వేడి పుడుతుంది. చలికాలం, వర్షాకాలంలో వచ్చే జలుబు, దగ్గునునివారించడానికి ఈ వేడి ఉపకరిస్తుంది. అవిసె గింజలలో పీచు, ఖనిజాలు, విటమిన్లతో పాటు మాంసకృత్తులు సమృద్ధిగా ఉన్నాయి. శారీరక ఎదుగుదలకు, శిరోజాలుఆరోగ్యవంతంగా పెరగడానికి మాంసకృత్తులు దోహదం చేస్తాయి పీచుపదార్థాలు మల విసర్జన సాఫీగా జరగడానికి తోడ్పడతాయి.
  • రోజూ రెండు టీస్పూన్ల అవిసె గింజ‌లు తీసుకుంటే ప్రీ మెనోపాజ‌ల్‌, పోస్ట్ మెనోపాజ‌ల్ ద‌శ‌లో ఉన్న ఆడ‌వారికి వేడి ఆవిర్లు రాకుండా ఇవి కాపాడ‌తాయి.
Web TitleHealth Benefits: Flax Seeds for Skin Whitening
Next Story