Flax seeds: ఈ గింజలు రోజూ తింటే.. గుండె జబ్బులు రానేరావు.

Flax seeds
x

Flax seeds: ఈ గింజలు రోజూ తింటే.. గుండె జబ్బులు రానేరావు.

Highlights

Flax seeds: అవిసె గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతుంటారు. చూడ్డానికి చిన్నగా కనిపించినా వీటితో కలిగే ప్రయోజనాలు మాత్రం భారీగా ఉంటాయి.

Flax seeds: అవిసె గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతుంటారు. చూడ్డానికి చిన్నగా కనిపించినా వీటితో కలిగే ప్రయోజనాలు మాత్రం భారీగా ఉంటాయి. సూపర్‌ ఫుడ్‌గా చెప్పుకునే అవిసె గింజలను రెగ్యులర్‌గా తీసుకుంటే గుండె ఆరోగ్యం మెరుగవుతుందని నిపుణులు చెబుతున్నారు. అవిసెల్లో శరీరానికి అవసరమైన మంచి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడతాయి, గుండె సంబంధిత సమస్యల నుంచి కాపాడుతాయి. ఇంతకీ అవిసె గింజలను రెగ్యులర్‌గా తీసుకుంటే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

* అవిసెలో ఆల్ఫా లినోలెనిక్ యాసిడ్ (ALA) అనే ఒమేగా-3 కొవ్వు ఆమ్లం ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తపోటును తగ్గించడంలో, ధమనుల వాపు తగ్గించడంలో, కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా నిరోధించడంలో ఉపయోగపడుతుంది. దీని వల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది.

* అవిసె గింజలలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థలో చెడు కొలెస్ట్రాల్‌ను రక్తంలోకి వెళ్లకుండా అడ్డుకుంటుంది. దీని వల్ల అథెరోస్క్లెరోసిస్ (ధమనుల్లో ఫలకం పేరుకుపోవడం) వంటి సమస్యలు దూరం అవుతాయి.

* అధిక రక్తపోటు గుండె జబ్బులకు ప్రధాన కారణం. అవిసె గింజలు సిస్టోలిక్ (పై రీడింగ్), డయాస్టోలిక్ (కింద రీడింగ్) రక్తపోటును తక్కువ చేయడంలో సహాయపడతాయని పరిశోధనలు చెబుతున్నాయి.

* అవిసెలో లిగ్నాన్స్ అనే యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని వాపును తగ్గించడంలో, ధమనులు ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవడంలో సహాయపడతాయి.

* ఒమేగా-3లో ఉండే యాంటీ-అరిథమిక్ లక్షణాలు గుండె స్పందనను సరిగా ఉంచేందుకు సహాయపడతాయి. క్రమరహిత హార్ట్ బీట్‌ను నివారించడంలో అవి ఉపయోగపడతాయి.

గమనిక: ఈ వివరాలు కేలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యం విషయంలో వైద్యుల సూచనలే పాటించాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories