Fever Reasons: తరచూ జ్వరం వస్తుందా? అయితే ఇది ఈ ఐదు ప్రాణాంతక వ్యాధుల సంకేతం కావచ్చు!

Fever Reasons: తరచూ జ్వరం వస్తుందా? అయితే ఇది ఈ ఐదు ప్రాణాంతక వ్యాధుల సంకేతం కావచ్చు!
x

Fever Reasons: తరచూ జ్వరం వస్తుందా? అయితే ఇది ఈ ఐదు ప్రాణాంతక వ్యాధుల సంకేతం కావచ్చు!

Highlights

జ్వరం అనేది శరీరంలో ఏదైనా అంతర్గత సమస్యను తెలియజేసే మొదటి సూచన. సాధారణంగా జ్వరం మూడు నుంచి ఐదు రోజుల లోపు తగ్గిపోతుంది.

Fever Reasons: జ్వరం అనేది శరీరంలో ఏదైనా అంతర్గత సమస్యను తెలియజేసే మొదటి సూచన. సాధారణంగా జ్వరం మూడు నుంచి ఐదు రోజుల లోపు తగ్గిపోతుంది. అయితే, కొందరికి తరచూ – వారం వారం లేదా పది రోజులకు ఓసారి – జ్వరం రావడం, తగ్గడం పునరావృతమవుతూ ఉండటం గమనించవచ్చు. ఇది సాధారణంగా కనిపించే లక్షణం లాగే అనిపించవచ్చు, కానీ ఇది కొన్ని తీవ్రమైన వ్యాధుల సంకేతం కావచ్చునని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇలా పదేపదే జ్వరం రావడం పక్షవాతం వంటి తీవ్రమైన ఇన్ఫెక్షన్‌ను సూచించే అవకాశం ఉంది. ఇది వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్, లేదా పరాన్నజీవుల వల్ల కలిగినదైనా కావచ్చు. మళ్ళీ మళ్ళీ జ్వరం వస్తుంటే, దాని మూలకారణాన్ని నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించడం అత్యవసరం.

అలాగే, ఆటో ఇమ్యూన్ వ్యాధులు కూడా జ్వరానికి కారణం కావచ్చు. ముఖ్యంగా “లూపస్” అనే ఆటో ఇమ్యూన్ డిసార్డర్‌లో రోగ నిరోధక వ్యవస్థ శరీరంలోని కణజాలాలపైనే దాడి చేస్తుంది. దీనివల్ల శరీరంలో దెబ్బతినే ప్రాంతాల్లో ఇన్ఫ్లమేషన్ ఏర్పడి జ్వరం తలెత్తుతుంది.

జ్వరానికి మరో ముఖ్యమైన కారణం క్షయవ్యాధి, అంటే ట్యూబర్‌క్లోసిస్ (టీబీ). ఇది ఊపిరితిత్తులను ప్రభావితం చేసే ఒక తీవ్రమైన అంటువ్యాధి. టీబీ ఉన్నవారికి జ్వరం తరచూ వస్తూ, శరీరం బలహీనపడుతూ ఉండటం సాధారణం.

టైఫాయిడ్ కూడా అదే విధంగా శరీరంలో పునరావృతంగా జ్వరాన్ని కలిగించే వ్యాధి. మురికి నీరు లేదా కలుషిత ఆహారం తీసుకున్నప్పుడు ఈ వ్యాధి చుట్టేస్తుంది. టైఫాయిడ్ వస్తే, సాధారణంగా మందులు వేసుకొని ఇంట్లో ఉండిపోవడం కాకుండా వైద్యులను సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలి.

అంతేగాక, క్యాన్సర్, ముఖ్యంగా బ్లడ్ క్యాన్సర్ (ల్యూకేమియా) ఉన్నవారికి తరచూ జ్వరం రావడం జరుగుతుంది. ఇది మొదటి దశలో బయటపడే ఒక ముఖ్యమైన సంకేతంగా వైద్య నిపుణులు చెబుతున్నారు. అందుకే తరచూ జ్వరం వస్తే, దాన్ని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలి.

జ్వరం వచ్చినప్పుడు తేలికపాటి, శక్తినిచ్చే ఆహారం తీసుకోవడం అవసరం. ఉదాహరణకు గంజి, సూపులు, ఉడికించిన కూరగాయలు, ఫలాలు, మెత్తగా వండిన అన్నం వంటి ఆహారాలను తీసుకోవాలి. శరీరానికి తేమ తగ్గకుండా ఉండేలా ఎక్కువగా ద్రవాహారం తీసుకోవాలి. ఓఆర్ఎస్, కొబ్బరినీళ్ళు వంటి ద్రవాలు మంచివి. పోషకాహారాన్ని శరీరానికి అందించడమే కాదు, అదే సమయంలో కాఫీ, ఆల్కహాల్ వంటి కఫం పెంచే పదార్థాలను పూర్తిగా దూరం పెట్టాలి.

జ్వరాన్ని చిన్న విషయంగా తీసుకోవద్దు. అది తీవ్రమైన వ్యాధులకు గేట్వే కావచ్చు. కాబట్టి తరచూ జ్వరం వస్తే దాన్ని మినహాయించకుండా, తగిన సమయంలో వైద్యుడిని సంప్రదించడం మినిమం జాగ్రత్తగా తీసుకోవాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories