logo

అది అలాంటి ఇలాంటి జెయింట్ వీల్ కాదు.. ఎక్కితే ఇక అంతే..!

అది అలాంటి ఇలాంటి జెయింట్ వీల్ కాదు.. ఎక్కితే ఇక అంతే..!
Highlights

జెయింట్ వీల్.. అది అలాంటి.. ఇలాంటిది కాదు. మీరు ఎంతో ఇష్టంగా ఎక్కుదామనుకున్న.. అక్కడికెళ్లాక భయపడిపోవడం...

జెయింట్ వీల్.. అది అలాంటి.. ఇలాంటిది కాదు. మీరు ఎంతో ఇష్టంగా ఎక్కుదామనుకున్న.. అక్కడికెళ్లాక భయపడిపోవడం మాత్రం పక్కా. అవును ఎందుకంటే ఇది మాములు జెయింట్ వీల్ కాదు. సాధారణమైన జెయింట్ వీల్ కేవలం రౌండ్స్ మాత్రమే తిరిగుతుంది. కానీ ఇది అలా తిరగదు.. వంకర్లు తిరుగుతుంది. మధ్యలో ఉండే ఊచలు కూడా ఊడిపోయే అవకాశం ఉంది. చదవడానికే భయంగా ఉంది కదా.. అయ్యో అంత భయపడాల్సిన అవసరం లేదు.

కాలిఫోర్నియాలో కోచెల్లా వ్యాలీ మ్యూజిక్ అండ్ ఆర్ట్స్ ఫెస్టివల్ జరిగింది. ఆ ఫెస్టివల్ సందర్భంగా కోచెల్లా సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసింది. ఫస్ట్ వంద మంది ఆ జెయింట్ వీల్‌ని ఉచితంగా ఎక్కొచ్చు అంటూ ఓ ట్వీట్ కూడా చేసింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు షాక్ తిన్నారు. వంకర్లు తిరిగిపోతూ.. డాన్స్ చేస్తున్న జెయింట్ వీల్ ఆశ్చర్యపోయారు. అసలు ట్విస్ట్ ఏంటంటే.. ఈ వీడియోలో ఉన్నది నిజమైన జెయింట్ వీల్ కాదు. గ్రాఫిక్స్, మ్యూజిక్ ఫెస్టివల్ ప్రచారం కోసం ఈ వీడియోను తయారు చేశారు. ఈ పెర్రీస్ వీల్ కూడా మామూలు జెయింట్ వీల్స్ లానే ఉంటుంది. అలాగే పనిచేస్తుంది.

లైవ్ టీవి

Share it
Top