రోజూ ఇలా నడిస్తే మంచిది..

రోజూ ఇలా నడిస్తే మంచిది..
x
Highlights

ఇప్పుడు చాలా మందికి అరోగ్యంపై సృహ పెరిగింది. ఉదయం పూట కాస్త పార్కులకు వెళ్ళి వాకింగ్ చేస్తున్నారు. అయితే చాలా మందికి డౌట్ ఏంటంటే నిధానంగా...

ఇప్పుడు చాలా మందికి అరోగ్యంపై సృహ పెరిగింది. ఉదయం పూట కాస్త పార్కులకు వెళ్ళి వాకింగ్ చేస్తున్నారు. అయితే చాలా మందికి డౌట్ ఏంటంటే నిధానంగా నడిస్తేబెటరా..లేక వేగంగా నడిస్తే మంచిదా అని. అయితే దీనిపై పరిశోధకులు ఓ క్లారీటి ఇచ్చారు. నేమ్మదిగా నడిస్తే మనసుకు కాస్త ఉల్లాసంగా అనిపించినా.. దాని ప్రభావం బాడీలోని ఇంటర్నల్ పార్ట్స్‌పై పడే అవకాశం చాలా తక్కువ. శ్వాస వేగాన్ని పెంచే వ్యాయామాలే గుండెను,ఇతర అవయవాలను ఉత్తేజపరుస్తాయని బ్రిటిష్‌ అధ్యయనకారులు ఇటీవలే ఈ విషయాన్నే వెల్లడించాయి.

సాధరణంగా మన శరీరం చలనశీలమైనది. కావున దానికి మరింత ఉత్తేజం ఇవ్వాలంటే వేగవంతమైన వ్యాయమం అవసరం. ఉద్యోగాలు చేసేవారు కదులకుండా కూర్చుని పనుల్లోనే సుఖం ఉందని అనుకుంటారు. ఎక్కువ సేపు శరీరాన్ని నిశ్చల స్థితిలోనే ఉంచాలనుకుంటారు. కాళ్లు మరీ బరువెక్కినట్లు అనిపిస్తే, ఆ మూలనుంచి ఈ మూలకు అలా నాలుగు అడుగులు వేసి ఉరుకుంటారు. అతి తక్కువ వేగంతో నడిచేవారి ఆయుష్షు తగ్గిపోతున్నట్లు వారి పరిశోధనలో తేలింది.

స్లో వాకర్స్‌ లైఫ్ స్పాన్ 72 ఏళ్ళకు మించడం లేదని పరిశోధకులు వివరించారు. ఫాస్ట్‌ నడిచే వారి జీవితకాలం మాత్రం 87 ఏళ్ల దాకా ఉంటోందని చెబుతున్నారు.దానికి కారణం, వేగంగా నడిచేవారిలో గుండె, శ్వాసకోస వ్యవస్థ బలంగానూ, ఆరోగ్యవంతంగా మారుతుందని వారు స్పష్టం చేశారు. ప్రతి రోజూ జిమ్‌కు వెళ్లి, యోగా, ప్రాణాయామాలు చేయడం కుదురకపోతే క్రమం తప్పకుండా తక్కువ దూరమైన వేగంగా నడిస్తే సరిపోతుంది నిపుణులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories