పెలికాన్ పక్షుల ప్రత్యేకత తెలుసా...

పెలికాన్ పక్షుల ప్రత్యేకత తెలుసా...
x
Highlights

పెలికాన్ పక్షులకు పోడివాటి ముక్క, పొట్టితోక, చిన్నకాళ్లు, పెద్ద రెక్కలు ఉంటాయి. కాలిమధ్య చర్మం ఉండడం వలన భూమిమీద ఇవి ఈజీగా నడవలేవు. పెలికాన్ పక్షులు...

పెలికాన్ పక్షులకు పోడివాటి ముక్క, పొట్టితోక, చిన్నకాళ్లు, పెద్ద రెక్కలు ఉంటాయి. కాలిమధ్య చర్మం ఉండడం వలన భూమిమీద ఇవి ఈజీగా నడవలేవు. పెలికాన్ పక్షులు ఒకే చోట నివసించవు. వీటి రెక్కల నిర్మాణం చలినుంచి కాపాడలేవు. అందుకే శీతాకాలంలో భారతదేశం, ఆఫ్రికా, ఇరాక్, దేశాలకు వలస వెళ్తు ఉంటాయి.

మన దేశంలో కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల సరిహద్దుల్లోని కొల్లేరు సరస్సుకు ఇతర దేశాల నుంచి పెలికాన్లు వస్తాయి. నవంబర్‌ నుంచి డిసెంబర్‌ మధ్య ఇక్కడికి వచ్చే పెలికాన్లు... మార్చి నుంచి ఏప్రిల్‌ వరకూ ఉండి పిల్లలను కని వాటితో పాటు తిరిగి స్వస్థలాలకు వెళ్లిపోతాయి. పెలికాన్ పక్షుల్లో చాలా రకాల జాతులు ఇక్కడకు వస్తాయి. వీటి రంగును బట్టి అవి ఏ రకం జాతికి చెందిందో గుర్తించవచ్చు. స్పాట్‌బిల్ట్‌, డాల్మెషియ్‌, పింక్‌ బ్యాక్డ్‌, ఆస్ట్రేలియన్‌, పెరువియన్‌ ఇలా బోలెడు ఉన్నాయి. సైబీరియా, ఆస్ట్రేలియా, అమెరికన్‌ వైట్‌ పెలికాన్‌లు అక్కడ వేసవిని భరించలేక వేల కిలోమీటర్లు దాటి వచ్చి.. ఇక్కడ శీతాకాలాన్ని ఆస్వాదిస్తాయి.

వీటిలో గోధుమరంగు పెలికాన్లు మాత్రమే బాగా ఎత్తు నుంచి నీటిలోకి మునిగి లోతుగా డైవ్‌ చేసి చేపల్ని పడతాయి. మిగిలిన జాతులు తెల్లగా వుంటాయి. వీటి రెక్కలు పై బాగాన నలుపు లేక గోధుమరంగు మచ్చలు ఉంటాయి. ఆసియా దేశపు ఎర్రముక్కు జాతి పెలికాన్‌లు చిన్నగా ఉంటాయి. గ్రేట్‌ వైట్‌ పెలికాన్‌లు చాలా నైపుణ్యంగా చేపల్ని పట్టుకుంటాయి. 10 నుంచి 15 ఫెలికాన్స్‌లు అర్థవత్తాకారంలో గుంపులుగా చేరి ముక్కును నీటిలో ముంచి రెక్కలతో ముందుకు ఈదుకుంటూ వెళ్ళి చేపల్ని పట్టకుంటాయి.

పెద్ద పెలికాన్‌లు ఆహారాన్ని గొంతులో దాచుకుని చాలా దూరం నుంచి మోసుకొచ్చి చిన్న పెలికాన్‌లకు పెడతాయి. పెద్ద పెలికాన్‌లు నోరు తెరచినప్పుడు గిన్నెలాగా ఉన్న కింద దవడలో నుంచి ఆహారాన్ని చిన్నవి ముక్కుపెట్టి తీసుకుని తింటాయి.

మగ పెలికాన్‌ రెక్కలు చాచుకొని రాజసంగా తిరుగుతూ ఆడ పెలికాన్‌ని ఆకర్షిస్తుంది. జతకట్టిన వారం, పది రోజుల్లో పెలికాన్‌లు మూడు నుంచి ఆరు గుడ్లు పెడతాయి.

పెలికాన్‌ గుడ్లు తెలుపు రంగులో ఉంటాయి. 30 నుంచి 36 రోజుల్లో గుడ్లు నుంచి పిల్లలు బైటకొస్తాయి. పుట్టినప్పుడు వీటికి చిన్న ఈకలుంటాయి. మూడు నెలల్లోగా వీటి రెక్కలు బాగా పెరుగుతాయి. కాస్తా పెరిగిపెద్దవి కాగానే తల్లి పెలికాన్స్‌తో పాటు ఇవి కూడా సమూహంలో కలిసిపోతాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories