Health News: అధిక దాహం ఈ వ్యాధుల లక్షణం.. గమనించకుంటే చాలా ప్రమాదకరం..!

Excessive Thirst is a Symptom of These Diseases if not noticed it is very Dangerous
x

Health News: అధిక దాహం ఈ వ్యాధుల లక్షణం.. గమనించకుంటే చాలా ప్రమాదకరం..!

Highlights

Health News: మానవ శరీరంలో ఎక్కువ భాగం నీరు మాత్రమే ఉంటుంది. అందుకే వేసవిలో ఎక్కువగా నీరు తాగడం అవసరం.

Health News: మానవ శరీరంలో ఎక్కువ భాగం నీరు మాత్రమే ఉంటుంది. అందుకే వేసవిలో ఎక్కువగా నీరు తాగడం అవసరం. అయితే కొంతమంది ప్రతి గంటకు సాధారణం కంటే ఎక్కువ నీరు తాగుతారు. తీవ్రమైన దాహంతో బాధపడటం వల్ల ఎక్కువ నీరు తాగుతారు. వైద్య పరిభాషలో ఈ పరిస్థితిని పాలీడిప్సియా అని పిలుస్తారు. దీనిని అస్సలు తేలికగా తీసుకోవద్దు. వెంటనే వైద్యుడిని సంప్రదించి రక్త పరీక్షలు చేయించుకోవాలి. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

డీ హైడ్రేషన్‌

డీ హైడ్రేషన్‌ అనేది ఒక వ్యాధి కాదు ఇది ఒక చెడు వైద్య పరిస్థితి. శరీరంలో నీటి కొరత ఎక్కువగా ఉన్నప్పుడు ఏర్పడే పరిస్థితిని డీహైడ్రేషన్ అంటారు. ఇలాంటి సమయంలో తల తిరగడం, తలనొప్పి, వాంతులు, విరేచనాలు, బలహీనత వంటి సమస్యలు ఏర్పడుతాయి.

మధుమేహం

ఒక వ్యక్తికి మొదటిసారిగా మధుమేహం వచ్చినప్పుడు అతను దానిని గుర్తించలేడు. అయితే అధిక దాహం మధుమేహ లక్షణమని గుర్తుంచుకోండి. శరీరం ద్రవాలను సరిగ్గా నియంత్రించలేకపోవడం వల్ల ఇది జరుగుతుంది. చాలా దాహం అనిపించినప్పుడు ఖచ్చితంగా రక్తంలో చక్కెర పరీక్ష చేయించుకోవడం ఉత్తమం.

నోరు పొడిబారడం

కొంతమందికి తరచుగా నోరు పొడిబారుతుంది. దీంతో అధికంగా నీరు తాగుతుంటారు. లాలాజల గ్రంథులు లాలాజలాన్ని సరిగ్గా ఉత్పత్తి చేయలేనప్పుడు నోరు పొడిగా మారుతుంది. దీని కారణంగా ఒక వ్యక్తి చిగుళ్ల ఇన్ఫెక్షన్, నోటి దుర్వాసనను ఎదుర్కోవలసి ఉంటుంది.

రక్తహీనత

మన శరీరంలో ఎర్ర రక్త కణాల లోపం ఉన్నప్పుడు రక్తహీనత వస్తుంది. ఈ పరిస్థితిలో దాహం పరిమితులను దాటిపోతుంది. ఎప్పుడు నీళ్లు తాగాలనే కోరిక ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో వైద్యుడిని సంప్రదించడం అవసరం.

Show Full Article
Print Article
Next Story
More Stories