రాత్రిపూట మొబైల్‌ స్క్రీన్‌ అధికంగా చూస్తున్నారా.. ఈ వ్యాధి వచ్చే అవకాశం..

Excessive Exposure to Mobile Screens at Night can Lead to Diabetes
x

రాత్రిపూట మొబైల్‌ స్క్రీన్‌ అధికంగా చూస్తున్నారా.. ఈ వ్యాధి వచ్చే అవకాశం.. (ఫైల్ ఇమేజ్)

Highlights

Mobile Screens: రాత్రిపూట మొబైల్‌ స్క్రీన్‌ ఎక్కువగా చూస్తున్నారా.. అయితే మీకు...

Mobile Screens: రాత్రిపూట మొబైల్‌ స్క్రీన్‌ ఎక్కువగా చూస్తున్నారా అయితే మీకు మధుమేహం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ విషయాన్ని ఇటీవల స్ట్రాస్‌బర్గ్, ఆమ్‌స్టర్‌డామ్ విశ్వవిద్యాలయం పరిశోధకులు తేల్చారు. ఇది వింటే మీకు షాకింగ్‌ అనిపించవచ్చు. కానీ ఇది నిజమని నిరూపణ అయింది. రాత్రిపూట బ్లూ లైట్‌కి అడిక్ట్‌ కావడం వల్ల రక్తంలో తియ్యటి ఆహారాలు తినాలనే కోరిక పెరుగుతుందని వీరు నిర్దారించారు. అంతేకాదు అధికంగా ఊబకాయం బారిన పడుతున్నారని తేలింది. రక్తంలో షుగర్‌ లెవల్స్‌ పెరుగుతున్నాయని గుర్తించారు.

స్ట్రాస్‌బర్గ్ విశ్వవిద్యాలయం, ఆమ్‌స్టర్‌డామ్ విశ్వవిద్యాలయ వైద్యులు ఎలుకలపై చేసిన పరిశోధనలో ఈ నిజాలు తెలుసుకున్నారు. రాత్రిపూట కృత్రిమ కాంతిలో ఎలుకలను ఉంచినప్పుడు వాటి శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా పెరిగినట్లు వారు కనుగొన్నారు. అలాగే చాలా సేపు ఈ లైట్‌కి ఎక్స్‌పోజ్ అయిన తర్వాత వాటి బరువు పెరిగినట్లు నిర్దారించారు. ఎలుకల శరీరంలో ఉండే 80 శాతం హార్మోన్లు, శారీరక విధులు మానవులతో సమానంగా ఉంటాయి. కాబట్టి శాస్త్రవేత్తలు అనేక వందల సంవత్సరాల నుంచి మానవ శరీరానికి ముందు ఎలుకలపై ప్రయోగాలు చేస్తున్నారు. ఎలుకలపై చేసిన దాదాపు 100% ప్రయోగాలు మానవులపై నిజమని తేలాయి.

మీరు రాత్రిపూట టీవీ చూసినప్పుడు కానీ మొబైల్ స్క్రీన్ ముందు ఉన్నప్పుడు కానీ స్వీట్లు, ఇతర తియ్యటి ఆహారాలు తినాలనిపిస్తే దానికి కారణం కృత్రిమ నీలం. అందుకే మీరు గాడ్జెట్స్‌ పై సమయాన్ని తగ్గించుకుంటే మంచిది. ఒకవేళ మీ పనికి ల్యాప్‌టాప్, మొబైల్ చూడటం తప్పనిసరి అయితే బ్లూ లైట్ రేడియేషన్‌ను నివారించడానికి ఖచ్చితంగా యాంటీ గ్లేర్ గ్లాసెస్ ఉపయోగించండి. ఎందుకంటే ఇది నేరుగా మన కళ్లపై ప్రభావం చూపదు.

Show Full Article
Print Article
Next Story
More Stories