Salt: మీరు రోజూ ఉప్పు ఎక్కువగా తింటున్నారా.. తెలియకుండానే క్యాన్సర్ బారీన పడినట్లే

Excess Salt in Diet Linked to Increased Stomach Cancer Risk
x

Salt: మీరు రోజూ ఉప్పు ఎక్కువగా తింటున్నారా.. తెలియకుండానే క్యాన్సర్ బారీన పడినట్లే

Highlights

ఉప్పు ఆహారానికి రుచిని అందిస్తుంది. ఉప్పు లేకుండా ఏ కూరను అస్సలు తినలేము.

Too Much Salt Can Cause Stomach Cancer: ఉప్పు ఆహారానికి రుచిని అందిస్తుంది. ఉప్పు లేకుండా ఏ కూరను అస్సలు తినలేము. ఉప్పు ఆహార రుచిని పెంచుతుంది, కానీ ఎక్కువ ఉప్పు కూడా ఫుడ్ టేస్ట్ పాడు చేస్తుంది. అంతే కాకుండా మన ఆరోగ్యంపై కూడా చెడు ప్రభావాన్ని చూపుతుంది. ఇది తీవ్రమైన వ్యాధులకు దారితీస్తుంది. ఒక మీడియా నివేదికలో ప్రముఖ డాక్టర్ నినాద్ కడారే ఉప్పు, స్టమక్ క్యాన్సర్ మధ్య సంబంధాన్ని వివరించారు. అత్యధిక ఉప్పు మోతాడు స్టమక్ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందని తెలిపారు.

ఉప్పు కడుపు క్యాన్సర్‌కు ఎలా కారణమవుతుంది?

కడుపునకు నష్టం: ఉప్పు కడుపు పొరను దెబ్బతీస్తుంది. కడుపు పొరలో మంటను కలిగిస్తుంది. కడుపు పొరను దెబ్బతీస్తుంది.

H. పైలోరీ ఇన్ఫెక్షన్: ఉప్పు కడుపు క్యాన్సర్‌తో ముడిపడి ఉన్న H. పైలోరీ బ్యాక్టీరియా ప్రభావాన్ని పెంచుతుంది.

కణాల పెరుగుదలను పెంచుతుంది: ఉప్పు కడుపులో కణాల పెరుగుదలను పెంచుతుంది. ఇది కాలక్రమేణా క్యాన్సర్ ప్రమాదాన్ని ఎక్కువ చేస్తుంది.

ఎంత ఉప్పు తినాలి

డాక్టర్ నినాద్ కడారే మాట్లాడుతూ.. "ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం ఒకరు 5 గ్రాముల కంటే తక్కువ ఉప్పు తీసుకోవాలి. ఉప్పు ఎక్కువగా తినడం వల్ల కడుపు క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఒక వ్యక్తికి H. పైలోరీ ఇన్ఫెక్షన్ ఉంటే లేదా కుటుంబంలో కడుపు క్యాన్సర్ చరిత్ర ఉంటే, అప్పుడు అలాంటి వారికి ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

ఉప్పు తగ్గించడానికి చిట్కాలు:

ఆహార లేబుళ్ళను చెక్ చేయండి: ప్రాసెస్ చేసిన మాంసాలు, డబ్బాల్లో ఉంచిన వస్తువులు, స్నాక్స్ వంటి ప్యాక్ చేసిన ఆహార పదార్థాలలో తరచుగా అదనపు ఉప్పు ఉంటుంది. కాబట్టి వీటిని నివారించడం మంచిది.

ఇంట్లో వంట చేసుకోండి: మీరు మీ ఆహారాన్ని మీరే వండుకునేటప్పుడు, మీరు ఎంత ఉప్పు వేయాలో నియంత్రించవచ్చు. దీనితో, మీరు అధిక ఉప్పు తినడం నివారించవచ్చు.

మూలికలు, సుగంధ ద్రవ్యాలు ఉపయోగించండి: ఉప్పుకు బదులుగా సహజ మూలికలు , సుగంధ ద్రవ్యాలు ఉపయోగించండి. దీనితో ఆహారం కూడా రుచికరంగా ఉంటుంది.

కారంగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండండి: సోయా సాస్, కెచప్ వంటి వాటిలో అదనపు ఉప్పు ఉంటుంది. కాబట్టి వాటిని నివారించండి.

కడుపు క్యాన్సర్ ప్రమాదాన్ని ఉప్పు, సిగరెట్లు, ఆల్కహాల్ లాంటివి కూడా పెంచుతాయి. కడుపు క్యాన్సర్ గురించి ఆందోళన ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

Show Full Article
Print Article
Next Story
More Stories