రొయ్యల్లో అధికంగా ప్రొటీన్లు, కాల్షియం..

రొయ్యల్లో అధికంగా  ప్రొటీన్లు, కాల్షియం..
x
Highlights

ప్రతిరోజూ మనం తీసుకునే ఆహారంలోనే సంపూర్ణ ఆరోగ్యం ఉందని పెద్దలు చెబుతారు. శాకాహారంలోనే కాదు మాంసాహారం కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ముఖ్యంగా సీ...

ప్రతిరోజూ మనం తీసుకునే ఆహారంలోనే సంపూర్ణ ఆరోగ్యం ఉందని పెద్దలు చెబుతారు. శాకాహారంలోనే కాదు మాంసాహారం కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ముఖ్యంగా సీ ఫుడ్… సాధారణంగా సీ ఫుడ్ చాలా ఖరీదైనప్పటికి అందులో అనేక పోషక విలువలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

ప్రతి మనిషి ఏడాదికి కనీసం 10 కిలోల చేపలు గాని, రొయ్యలు గాని తినాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ తన నివేదికలో పేర్కొంది. అంతటి విశిష్టత ఉన్న సీ ఫుడ్ లో ప్రధానమైన రొయ్యల గురించి తెల్సుకుందాం.

* రొయ్యల్లో ప్రొటీన్లు, కాల్షియం అధికంగా ఉన్నాయి. దీని వల్ల ముసలితనంలో వచ్చే ఎముకల బలహీనత తగ్గుతుంది.

* రొయ్యలలో ఉన్న మెగ్నీషియం నరాల బలహీనతను తగ్గిస్తుంది. శరీర దారుఢ్యానికి దోహదపడుతుంది.

* రొయ్యలు రక్తంలో ఉన్న గ్లూకోజ్ స్ధాయిలను అదుపు చేస్తుంది. రక్తపోటును కూడా అదుపు చేస్తుంది. దీని వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తక్కువని వైద్య నిపుణులు చెబుతున్నారు.

* తరచూ రొయ్యలు తినడం వల్ల ముసలితనంలో వచ్చే సమస్యలకు చెక్ పెట్టవచ్చు.

* రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తక్కువగా ఉన్నవారు రొయ్యలు తింటే… హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయని వైద్యులు చెబుతున్నారు.

* రొయ్యల్లో ఉన్న ప్రొటీన్లు ఎనీమియా బారి నుండి కాపాడుతాయి. మెదడుకు అక్సిజన్ అందించేందుకు రొయ్యలు ఎంతో ఉపయోగపడతాయి.

* తరచూ రొయ్యలు తింటే మెదడుకు సంబంధించిన వ్యాధులు దరి చేరవని, జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు.

ఇన్ని సద్గుణాలు ఉన్న రొయ్యలను వారానికి ఒకసారైనా తింటే ఆరోగ్యం మీ వెంటే ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories