నిద్ర వల్ల ఇన్ని సమస్యలా..!

నిద్ర వల్ల ఇన్ని సమస్యలా..!
x
Highlights

నిద్ర.. అనేక సమస్యలకు కారణం ఇదే అంటున్నారు నిపుణులు. ఎక్కువ సేపు నిద్ర పోయిన.. అసలు నిద్ర లేకపోయిన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందంటున్నారు నిపుణులు....

నిద్ర.. అనేక సమస్యలకు కారణం ఇదే అంటున్నారు నిపుణులు. ఎక్కువ సేపు నిద్ర పోయిన.. అసలు నిద్ర లేకపోయిన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. అయితే మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఆరు నుంచి ఎనిమిది గంటలు నిద్ర పోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

చాల మంది ఎక్కువ సేపు నిద్ర పోతుంటారు. కొంత మంది రాత్రి వేళలో కాకుండా పగలు నిద్ర పోతుంటారు. రాత్రులు నిద్రలేకుండా ఉంటే.. అది మధుమేహానికి దారి తీస్తుందంటున్నారు నిపుణులు. నిద్రలేమితో రక్తంలో గ్లూకోస్ స్థాయిని నియంత్రించే సామర్థ్యం కూడా దెబ్బతింటుందని, నిద్రలేమి రోగనిరోధక వ్యవస్థను దెబ్బతీస్తుందని.. దీంతో తొందరగా ఇన్ఫెక్షన్లు సోకే అవకాశముటుందని అధ్యయనాలు తెలుపుతున్నాయి.

ఆరు గంటల కంటే తక్కువగా నిద్రపోవడాన్ని తక్కువ నిద్ర అంటారు. పది గంటల కన్నా ఎక్కువ నిద్రపోవడాన్ని ఎక్కువ నిద్ర అంటారు. అయితే ఎక్కువ నిద్ర, తక్కువ నిద్ర రెండూ ఆరోగ్యానికి మంచివి కావంటున్నారు పరిశోధకులు. ఏడు గంటల కన్నా ఎక్కువ నిద్ర పోయేవారికన్నా, తక్కువ నిద్రపోయేవారికి జలుబు త్వరగా వస్తుందని ఓ అధ్యయనంలో తేలింది.

ప్రతిరోజూ మెదడులో కొన్ని వ్యర్ధ కణాలు పెరుగుతాయని, నిద్రపోయినప్పుడు అవి తొలగిపోతాయని పరిశోధకులు చెబుతున్నారు. అందుకే సరిపడ నిద్రలేకపోతే ఆ వ్యర్ధ కణాలు మెదడులో పేరుకుపోతాయని, ఆ పరిస్థితి అలానే కొనసాగితే మెదడు పనితీరుపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories