నిద్ర బాగా పట్టడానికి మందు కొడుతున్నారా..!

నిద్ర బాగా పట్టడానికి మందు కొడుతున్నారా..!
x
Highlights

నిద్ర బాగా పట్టాలని మందు తాగే వాళ్లు చాలమంది ఉన్నారు. రాత్రిపూట ఆల్కహాల్ తాగితే నిద్ర బాగా పడుతుందని పీకలు దాక తాగుతుంటారు. అయితే మందు తాగితే నిద్ర...

నిద్ర బాగా పట్టాలని మందు తాగే వాళ్లు చాలమంది ఉన్నారు. రాత్రిపూట ఆల్కహాల్ తాగితే నిద్ర బాగా పడుతుందని పీకలు దాక తాగుతుంటారు. అయితే మందు తాగితే నిద్ర బాగా పడుతుందన్నది ఓ అపోహ మాత్రమేనని అధ్యయనాలు చెబుతున్నాయి. నిద్రపోవటానికి లిక్కర్ లేదా వైన్ పనిచేయొచ్చు.. కానీ దానివల్ల నిద్ర ద్వారా మీ శరీరానికి సహజంగా అందాల్సిన విశ్రాంతి మాత్రం దొరకదంటున్నారు నిపుణులు. నిద్రకు ముందు ఆల్కహాల్ తీసుకుంటే.. అది నిద్రావస్థను భంగపరుస్తుందట. ఈ నిద్రావస్థ జ్ఞాపకాలకు, విషయాలను తెలుసుకోవడానికి చాలా ముఖ్యమైనదంటున్నారు నిపుణులు.

అదేమి లేదే.. మందు తాగాక నిద్ర బాగానే పడుతోందే.. అని కొంత మంది మందు బాబులు ఆలోచిస్తున్నారా..! మీరు నిద్రపోగలరు కానీ, నిద్ర వల్ల కలిగే లాభాలను కోల్పోతారంటున్నారు నిపుణులు . ఆల్కహాల్ తీసుకుంటే నిద్రపడుతుందనేది కేవలం అపోహ మాత్రమేనని అంటోంది న్యూయార్క్ యూనివర్సిటీ బృందం. నిద్రకు సంబంధించిన అపోహలకు దూరంగా ఉంటే, మనుషుల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగవుతుందని, ఆనందంగా జీవించొచ్చని ఈ బృందం ఆశిస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories