Bloating: కడుపులో గ్యాస్ వేధిస్తుందా? అజీర్తిగా ఉందా? మీ వంటగదిలోనే 5 మందులు..!

Effective Home Remedies for Quick Gas and Bloating Relief with Kitchen Ingredients
x

Bloating: కడుపులో గ్యాస్ వేధిస్తుందా? అజీర్తిగా ఉందా? మీ వంటగదిలోనే 5 మందులు..!

Highlights

Quick Gas And Bloating Relief: చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఈ మధ్యకాలంలో కడుపులో గ్యాస్, అజీర్తితో బాధపడుతున్నారు.

Quick Gas And Bloating Relief: చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఈ మధ్యకాలంలో కడుపులో గ్యాస్, అజీర్తితో బాధపడుతున్నారు. దీంతో వీళ్ళు టాబ్లెట్స్ వేసుకోక తప్పదు. ప్రతిదానికి మందులపై ఆధారపడాల్సి వస్తోంది. అయితే గ్యాస్, అజీర్తి సమస్యకు కొన్ని ఇంటి చిట్కాలు ఉన్నాయి.

కడుపులో గ్యాస్ అజీర్తి చేసిన వారు కొన్ని ఇంటి చిట్కాలతో తగ్గించుకోవచ్చు. ప్రతిదానికి మందులు వేసుకోకుండా ఇవి తక్షణమే రిలీఫ్ అందిస్తాయి. మన బామ్మల కాలం నాటి నుంచి ఫాలో అవుతున్న ఈ చిట్కాలు మీ ఇంటి వంటగదిలోని అందుబాటులో ఉంటాయి. దీంతో జీర్ణక్రియ మెరుగైపోయి తక్షణమే ఉపశమనం లభిస్తుంది.

కడుపులో గ్యాస్, అజీర్తి చేసినప్పుడు ఎక్కువగా నీరు తీసుకోవాలి. ఇలా చేయటం వల్ల యాసిడ్ లెవెల్స్ తగ్గిపోతాయి. అజీర్తి కూడా తగ్గిపోతుంది. మంచి రిలీఫ్ పొందుతారు.

ఇక కడుపులో గ్యాస్, అజీర్తి వేధించినప్పుడు అరటి పండ్లు కూడా తీసుకోవాలి. ఇందులో విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. మన కడుపులో ఉన్న యాసిడ్ స్థాయిలను తగ్గిస్తుంది. దీంతో యాసిడిటీ సమస్యకు వెంటనే పరిష్కారం లభిస్తుంది.

పుదీనా కూడా గ్యాస్ సమస్య నుంచి మనకు తక్షణ రిలీఫ్ అందిస్తుంది. పుదీనాను జ్యూస్ రూపంలో తీసుకోవాలి. ఇందులో కాస్త ఉప్పు వేసుకొని తీసుకోవటం వల్ల తక్షణమే కడుపులో గ్యాస్ తగ్గిపోతుంది.

సోంపు..

ప్రతిరోజు భోజనం తర్వాత సోంపు తినే అలవాటు మన భారతీయ సంప్రదాయంలో ఉంది. అయితే సోంపు నీటిని తీసుకోవడం వల్ల కడుపులో గ్యాస్, అజీర్తి తగ్గిపోతుంది. ఇది మన శరీర ఆరోగ్యానికి కూడా మంచిది.

తరచూ మన డైట్ లో దాల్చిన చెక్క పొడి చేర్చుకోవడం వల్ల కూడా కడుపులో యాసిడిటీ స్థాయిలు తగ్గిపోతాయి. మంచి జీర్ణక్రియకు ప్రేరేపిస్తుంది. అంతేకాదు ఇది గ్యాస్ స్థాయిలను కూడా తగ్గిస్తుంది.

ఈ చిట్కాలు మంచి ఉపశమనం కలిగిస్తాయి. అంతేకాకుండా ఆరోగ్యకరమైన డైట్ మాత్రమే ఫాలో అవ్వండి. అతిగా మసాలా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి. ఇవి యాసిడిటీ, గ్యాస్ సమస్యలను తెచ్చి పెడతాయి. మన డైట్‌లో పండ్లు తప్పకుండా చేర్చుకోవాలి. ముఖ్యంగా ఉడికించిన కూరగాయలు తప్పనిసరిగా తీసుకోవాలి. ప్రతిరోజు పండ్లు, కూరగాయలు మాత్రమే తీసుకోండి. ఇది శరీర ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories