Acidity: కడుపులో గ్యాస్, యాసిడిటీ తరచుగా వేధిస్తోందా? ఈ చిన్ని చిట్కా ట్రై చేసి చూడండి

Acidity
x

Acidity: కడుపులో గ్యాస్, యాసిడిటీ తరచుగా వేధిస్తోందా? ఈ చిన్ని చిట్కా ట్రై చేసి చూడండి

Highlights

Acidity Relief: చాలామందికి ఉదయం లేవగానే కడుపులో నొప్పి, యాసిడిటీ పేరుకుపోతుంది. దీనికి కొన్ని ఇంటి చిట్కాలు ఉన్నాయి. అది వాడటం వల్ల తక్షణ రిలీఫ్ పొందుతారు.

Acidity Relief: కడుపులో యాసిడ్ స్థాయిలు పెరిగిపోవడం వల్ల యాసిడిటీ పెరుగుతుంది. తద్వారా కడుపునొప్పిగా ఉంటుంది. దీనికి కొన్ని రకాల హెర్బల్‌ టీ, ఆల్కలైన్ ఫుడ్స్, డైటరీ మార్పులు చేర్చుకోవడం వల్ల తక్షణ సమస్య నుంచి విముక్తి పొందుతారు.

అల్లం టీ..

అల్లం టీ తీసుకోవడం వల్ల కడుపులో ఉపశమనం అందిస్తుంది. ఇది ఇన్‌ఫ్లమేషన్‌ సమస్యను తగ్గిస్తుంది. ఇందులో సహజ సిద్ధంగా గ్యాస్ నివారించే గుణాలు కలిగి ఉంటాయి. యాసిడిటీని సమర్థవంతంగా తగ్గిస్తుంది. ఇది తలనొప్పిని కూడా తగ్గిస్తుంది. అల్లం టీ తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి.

సోంపు గింజలు..

రాత్రి నానబెట్టిన సోంపు గింజలను ఉదయం ఆ నీటిని తీసుకోవడం వల్ల కడుపులో గ్యాస్, అజీర్తికి చెక్ పెట్టచ్చు. ఇది జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తిని మెరుగు చేస్తుంది. దీంతో కడుపులో గ్యాస్ స్థాయిలు తగ్గిపోతాయి. తిన్న తర్వాత సోంపు తినే అలవాటు కూడా చేసుకోవాలి.

జీలకర్ర..

జీలకర్ర నీటిని తాగడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గిపోతాయి. కడుపులో గ్యాస్‌కు తక్షణ రెమెడీ. ఇది కడుపులో ఉండే యాసిడ్ స్థాయిలను సమం చేస్తుంది. మనం తీసుకునే ఆహారంలో జీలకర్ర వేసుకుంటాం. పొడి కూడా అందుబాటులో ఉంటుంది. ఉదయం జీలకర్ర పొడిని నీళ్లలో కలుపుకుని తేనె వేసుకుని కూడా తీసుకోవచ్చు.

యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌..

కడుపు సమస్యలకు యాపిల్ సైడర్ వెనిగర్ కూడా ఒక చక్కని రెమిడీ అని చెప్పాలి. బ్రేక్ ఫాస్ట్ తర్వాత ఈ యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకోవడం వల్ల కడుపులో యాసిడ్ స్థాయిలు సమతులను చేస్తుంది. దీంతో గ్యాస్‌కు చెక్‌ పెడుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories