అంధత్వాన్ని దూరం చేసే గుడ్డు

అంధత్వాన్ని దూరం చేసే గుడ్డు
x
Highlights

శరీరంలో అన్ని భాగాల కన్నా విలువైనవి కళ్లు. ఎక్కువ సమయం కంప్యూటర్‌ ముందు కూర్చున్నా..గంటల తరబడి టీ.వీ చూస్తున్నా.. స్మార్ట్‌ ఫోన్‌ ను ఎక్కువ సేపు ...

శరీరంలో అన్ని భాగాల కన్నా విలువైనవి కళ్లు. ఎక్కువ సమయం కంప్యూటర్‌ ముందు కూర్చున్నా..గంటల తరబడి టీ.వీ చూస్తున్నా.. స్మార్ట్‌ ఫోన్‌ ను ఎక్కువ సేపు వాడినా... కళ్లు మండి కండ్లల్లో నుండి నీరు కరుతుంది. అంతేకాదు పౌష్టికాహార లోపంతో కూడా కళ్ళు మండుతాయి. కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం లో ఆరోగ్యం తప్పనిసరిగా ఉండాలి. రోజుకు ఒకటి లేదా రెండు గుడ్లు తినాలి. గుడ్లల్లో ముఖ్యంగా ప్రోటిన్స్‌, విటమిన్‌ ఎ, డి, బి6 లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి అంధత్వాన్ని దూరం చేస్తాయి.

కంటిచూపును మెరుగుపరిచే గుణాలు క్యారెట్ లో ఎక్కువగా ఉంటాయన్న విషయం తెలిసిందే..ఇవే గుణాలు గుడ్డులో కూడా ఉన్నాయంటున్నారు ఆస్ట్రేలియా పరిశోధకులు. గుడ్డును వారంలో మూడు లేదా నాలుగు రోజుల పాటు తీసుకుంటే 50 సంవత్సరాల తరువాత కనిపించే చత్వారం, అధత్వం , ఇతర కంటి సమస్యల నుంచి వృద్ధులు తప్పించుకోవచ్చని వారు చెబుతున్నారు. సుమారు నాలుగువేల మంది స్త్రీ, పురుషుల మీద పదిహేను సంవత్సరాల పాటు అధ్యయనం చేసి ఈ విషయాన్ని కనుగొన్నారు. గుడ్డులోని కెరోటినాయిడ్స్, ల్యూటిన్ ఇతర పోషకాలు కంటిచూపును కాపాడతాయని వారు అంటున్నారు. వారంలో ఒక రోజు మాత్రమే గుడ్డు తీసుకునేవారికి కంటి సమస్యలు తప్పకపోవచ్చునని వారకు చెబుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories