Weight Loss: చలికాలంలో ఈ 4 పరాటాలు తింటే సులభంగా బరువు తగ్గొచ్చు..!

Eat These 4 Types of Stuffed Parathas in Winter for Lose Weight
x

Weight Loss: చలికాలంలో ఈ 4 పరాటాలు తింటే సులభంగా బరువు తగ్గొచ్చు..!

Highlights

Stuffed Parathas: చలిపెరడగంతో ఉదయాన్నే లేవడం, వ్యాయామం చేయడం చాలా కష్టంగా మారింది. దీంతో ఫిట్‌గా ఉండటం చాలా కష్టంగా మారుతోంది.

Stuffed Parathas: చలిపెరడగంతో ఉదయాన్నే లేవడం, వ్యాయామం చేయడం చాలా కష్టంగా మారింది. దీంతో ఫిట్‌గా ఉండటం చాలా కష్టంగా మారుతోంది. చలికాలంలో పూరీలు, పరోటాలు, క్యాలరీలు, కొవ్వులు అధికంగా ఉండే స్వీట్లు వంటి వాటిని వేడివేడిగా, రుచికరంగా తినాలనే కోరిక కూడా పెరుగుతుంది. ఇది మన ఆరోగ్యానికి ఎంత హానికరమో తెలిసినా.. మనం వీటిని ఎక్కువగా తింటాం. ఇవి బరువు పెరగడానికి దారితీస్తాయి. అలాగే జీవక్రియను కూడా నెమ్మదించేలా చేస్తుంది. మీరు శీతాకాలంలో బరువు తగ్గడానికి చాలా చిట్కాలు చదివే ఉంటారు. అయితే ఈ కాలంలో హెల్దీగా బరువు తగ్గేందుక కొన్ని చిట్కాలు తీసుకొచ్చాం. అవేంటో చూద్దాం.

బరువు తగ్గడానికి కొన్ని రకాల పరాటాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వీటిని చలికాలంలో తినడమే కాకుండా, వీటితో బరువు కూడా వేగంగా తగ్గుతారు. మనం బ్రేక్‌ఫాస్ట్‌గా పరాటాలు తింటున్నాం. కానీ ఈ రోజుల్లో కూరగాయలతో పరాటాలు తయారు చేస్తే , అది బరువు తగ్గడంలో చాలా సహాయపడుతుంది. కాబట్టి బరువు తగ్గడానికి ఈ ఆరోగ్యకరమైన, రుచికరమైన పరాటాల గురించి తెలుసుకుందాం.

1. ఉల్లిపాయ పరాటా

బరువు తగ్గడానికి, మీరు శీతాకాలంలో ఉల్లిపాయ పరాటాలను తినవచ్చు. ఉల్లిపాయ పరాటాను మనం తప్పకుండా తింటూనే ఉంటాం. కానీ, ఈ పరాఠాను సరిగ్గా తీసుకుంటే బరువు కూడా తగ్గుతుందని ఎవరికీ తెలియదు. ఉల్లిపాయలో కొల్లాజెన్ పుష్కలంగా ఉంటుంది. ఇందులో విటమిన్ సి తగినంత మొత్తంలో ఉండటం వల్ల రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలోనూ సహాయపడుతుంది. దీని వినియోగం బరువును తగ్గించడమే కాకుండా, ఆరోగ్యంతోపాటు ఫిట్‌నెస్‌గా ఉండేందుకు సహాయపడుతుంది.

2. పాలకూర పరాటా

పోషకాలతో నిండిన అల్పాహారం కోసం పాలకూర పరాఠాను తయారు చేసి తినవచ్చు. పాలకూరలో విటమిన్లు E, B, K, పొటాషియం, మెగ్నీషియంతోపాటు కాల్షియం వంటి సూక్ష్మపోషకాలతో నిండి ఉంటుంది. అందుకే ఇది ఆరోగ్యకరమైన ఎంపికలో అగ్రభాగాన ఉంటుంది. ఇది తక్కువ కేలరీలను కలిగి ఉండి, శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. ఇందులో ఎక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండడంతో.. మీరు దీన్ని తిన్న తర్వాత చాలా కాలం పాటు కడుపు నిండిన అనుభూతిని కలిగి ఉంటారు. దీంతో త్వరగా బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది.

3. ముల్లంగి, క్యారెట్ పరాటా

ముల్లంగి, క్యారెట్ రెండింటినీ తరచుగా సలాడ్లలో ఉపయోగిస్తారు. ఈ రెండూ ఫైబర్‌కు అద్భుతమైన మూలాలను కలిగి ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడమే కాకుండా బరువు తగ్గడంలోనూ మేలు చేస్తాయి. అందుకే ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో ముల్లంగి, క్యారెట్ పరాటాలను తీసుకోవచ్చు.

4. మేతి పరాటా

మేతిలో మంచి నాణ్యమైన ఫైబర్ తగినంత పరిమాణంలో ఉంటుంది. ఫైబర్ జీర్ణక్రియలో సహాయపడటమే కాకుండా రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. ఇవి బరువు పెరగడానికి కారణమయ్యే అనవసరమైన ఎలిమెంట్స్‌ని వదిలించడంలో సహాయపడతాయి.

పరాటాల ప్రయోజనాన్ని పొందాలంటే ఇలా తినండి..

ఈ స్టఫ్డ్ పరాఠాలను తినేటప్పుడు ఎక్కువ నూనెను ఉపయోగించవద్దు. పరోటా ఉడికిన తర్వాత కొద్దిగా నెయ్యి రాసుకుంటే రుచి పెరగడమే కాకుండా కొవ్వు కూడా తగ్గుతుంది.

బరువు తగ్గడానికి, పెరుగుతో పరాటా తినడం చాలా మంచిది. నిజానికి, పెరుగులో ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇది జీవక్రియలో సహాయపడుతుంది. పెరుగు కూడా ఒక గొప్ప కొవ్వు బర్నర్‌గా పనిచేస్తుంది. జీర్ణవ్యవస్థను చక్కగా ఉంచేందుకు సహాయపడుతుంది.

సాధారణ పిండికి బదులు మల్టీగ్రెయిన్ పిండితో భర్తీ చేయండి. వీటిలో జొన్నలు, సజ్జలు, రాగులు ఉండేలా చూసుకుంటే బెటర్. ఈ గింజలన్నింటిలో ఫైబర్ చాలా మంచి మొత్తంలో ఉంటుంది. ఇది మీకు చాలా కాలం పాటు కడుపు నిండుగా అనిపించేలా చేస్తుంది. బరువు పెరగకుండా చేస్తుంది.

గోధుమ పిండిని ఎక్కువగా ఉపయోగించడం అనారోగ్యాలకు దారి తీస్తుంది. ఇది మీ బరువు తగ్గించే ప్రయాణానికి ఆటంకంలా మారుతుంది. బరువు తగ్గాలని కోరుకుంటే మాత్రం ఈ పిండిని ఉపయోగించకూడదు.

పరాటాలకు మసాలా దినుసులు జోడించడం వల్ల రుచి పెరగడమే కాకుండా జీర్ణక్రియ, జీవక్రియలో కూడా సహాయపడుతాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories