Top
logo

Hair Care Tips: ఎండా కాలం జట్టును కాపాడుకోండిలా

Easy & Effective Summer Hair Care Tips
X

ఫైల్ ఇమేజ్


Highlights

Hair Care Tips: ఎండా కాలంలో అధిక చెమట, కాలుష్యం వంటివన్నీ జుట్టుపై ప్రభావం చూపుతాయి.

Hair Care Tips: ఎండాకాలం వచ్చేసింది. ఏదో ఒక పని మీద బయటకు వెళ్ళక తప్పదు. ఆ టైంలో అధిక చెమట, కాలుష్యం వంటివన్నీ జుట్టుపై ప్రభావం చూపుతాయి. చుండ్రు మొదలు,చివర్లు చిట్లడం, తలపొడిబారడం వంటి సమస్యలు ఎదురవుతాయి. దీంతో జట్టు గడ్డిలా తయారవుతూ వుంటుంది. మరి ఎండా కాలంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో మన లైఫ్ స్టైల్ లో తెలుసుకుందామా...

ఆరోగ్యకరమైన జుట్టు కుదుళ్లు నుంచే ప్రారంభమవుతుంది. అందుకే కుదుళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే టోపీ, స్కార్ఫ్​ , స్టోల్స్ వాడటం మంచిది. హెయిర్ స్పా ట్రీట్​మెంట్ చేయించుకుంటే జుట్టు సంబంధిత సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. తలకు ఉపయోగించే దువ్వెనలు, బ్రష్​లను తరచూ వేడినీటిలో కడగాలి. ఇతరుల దువ్వెనలను వాడకపోవడం మంచిది. ఒక్కోసారి తలస్నానం చేశాక జుట్టు ఆరబెట్టడానికి తగిన టైం ఉండదు. అలానే అల్లేసుకుని వెళ్లిపోతారు. ఇలా చేయడం వల్ల బ్యాక్టీరియల్, ఫంగల్​ ఇన్​ఫెక్షన్లు ఏర్పడతాయి. అందుకే జుట్టుని చక్కగా ఆరబెట్టుకోవాలి.ప్రతిరోజు ఎండలో తిరుగుతున్నా..వారానికి ఒకసారి మాత్రమే తలస్నానం చేస్తుంటారు చాలామంది. కానీ, కాలుష్యం వల్ల జుట్టులో పేరుకుపోయిన మురికిని, కాలుష్యకారకాలను తొలగించాలంటే వారానికి రెండుమూడు సార్లు తలస్నానం చేయాలంటున్నారు ఎక్స్‌‌పర్ట్స్. స్నానం చేసే అరగంట ముందు తలకు కొబ్బరి నూనె పట్టించితలస్నానం చేయాలి. అయితే, నాణ్యమైన షాంపూలనే ఎంచుకోవాలి. అప్పుడే జుట్టులో తేమ కోల్పోకుండా జుట్టు చివర్లు చిట్లకుండా ఉంటాయి. తరచూ చేయొద్దు.

కొందరు పదే పదే తలస్నానం చేస్తుంటారు. ఇది కూడా ప్రమాదమే. ఇలా చేయడం వల్ల తల్లో ఉండే సహజమైన నూనెలు ఆవిరవుతాయి. దాంతో వెంట్రుకలు పొడిబారి జుట్టు పీచులా మారుతుంది. తరచూ షాంపూతో తలస్నానం చేయడం వల్ల కూడా జుట్టు సహజ రంగుని కోల్పోతుంది. గోధుమరంగులోకి మారుతుంది. మెరుపూ తగ్గుతుంది. దీనికి తోడు తలపై చర్మం పొడిబారి పొలుసులు పొలుసులుగా తయారవుతుంది. అందుకే వారానికి రెండు లేదా మూడు సార్లు మాత్రమే తలస్నానం చేయాలి. వేసవిలో హెయిర్​ ​స్టైల్స్​ అంటూ జుట్టుని మరీ కష్టపెట్టకుండా సులభంగా ఉండే స్టైల్స్​ పాటించాలి. జుట్టుని ఎక్కువగా ఒత్తిడికి గురిచేయకుండా లీవ్​ చేసుకోవడం మంచిది.అయితే జర్నీలప్పుడు లీవ్ చేయకూడదు.

రాత్రిపూటంతా నూనెరాసి వదిలేయడం జుట్టు స్థితిని చాలా మెరుగుపరుస్తుంది. గోరువెచ్చని ఆలివ్ నూనె లేదా కొబ్బరినూనెను రాత్రిపూట తలకి మసాజ్ చేసి అలా వదిలేయండి. ఇది మీ కుదుళ్ళ నుంచి పోషణనిచ్చి, ఎండాకాలంలో వేడితో చక్కగా పోరాడుతుంది.

రకరకాల హెయిర్​ స్టైల్స్​ కోసం బ్లో డ్రయర్, స్ర్టయిట్​నర్​, కర్లర్​ లాంటివి వాడుతుంటారు అమ్మాయిలు. అయితే వీటిని సరైన పద్ధతిలో వాడకపోతే జుట్టు చిట్లడం, పొడిబారడం లాంటి సమస్యలు ఏర్పడతాయి. కొంత మంది జుట్టు తడిగా ఉన్నప్పుడే బ్లో డ్రయర్​ వాడుతుంటారు. కానీ, జుట్టుని ఆరనిచ్చాకే దీన్ని వాడాలి. స్ర్టయిట్​నర్, కర్లర్ఉపయోగించే ముందు తప్పనిసరిగా ప్రొటెక్షన్ సీరమ్​లను ఉపయోగించాలి.

గాలిలో తేమ లేకపోవటం వలన మీ జుట్టు ఆరోగ్యం దెబ్బతిని, ఎండిపోయినట్లుగా అయిపోతుంది. ఇలా జరగకుండా నివారించటానికి మీ జుట్టుకి తేమనిచ్చే హెయిర్ మాస్క్లను వాడండి. బ్యూటీ స్టోర్ల నుంచి అలాంటి ఉత్పత్తులు కొనండి లేదా ఇంట్లోనే అరటిపండు, గుడ్లు, ఆలోవెరా జెల్ వంటి సహజపదార్థాలను కలిపి ఒకటి తయారుచేసుకోండి.

చేపల్లో మాంసకృతులు, ఒమెగా3, ఫ్యాటీ ఆమ్లాలు వుంటాయి. చేపల్ని తినడం వల్ల జుట్టు హెల్దీగా, అందంగా ఉంటుంది. గుడ్డులో జింక్​, సల్ఫర్, ఐరన్​, సెలీనియం లాంటి మూలకాలుంటాయి. అందుకే ప్రతిరోజు ఒక గుడ్డు తినడం వల్ల జుట్టు హెల్దీగా ఉంటుంది.

బాదం, వాల్​నట్, జీడిపప్పుల్లో కూడా ఫ్యాటీ ఆమ్లాలుంటాయి. వీటిలోని విటమిన్–​ ఇ, బయోటిన్​లు జుట్టు రాలడాన్ని కంట్రోల్ చేస్తాయి. జుట్టు పెరగాలంటే ఎక్కువగా ఆకుకూరలు తినాలి. వీటిలో ఉండే ఐరన్​.. కుదుళ్లను బలంగా ఉంచడమే కాకుండా వెంట్రుకలను చిట్లకుండా చేస్తుంది. విటమిన్– ఎ కూడా జుట్టుకి చాలా మంచిది. అందుకే క్యారెట్స్, ఆకుకూరలు తినాలి. మీగడ తీసిన పాలూ, చీజ్​ కూడా వెంట్రుకలు చిట్లిపోకుండా కాపాడతాయి. బలంగా ఉంచుతాయి.

Web TitleEasy & Effective Summer Hair Care Tips
Next Story