Driving Car Wearing Sandals: చెప్పులు ధరించి కారు నడుపుతున్నారా.. ప్రమాదం పొంచి ఉన్నట్లే..!

Driving A Car Wearing Sandals Know About These Problems
x

Driving Car Wearing Sandals: చెప్పులు ధరించి కారు నడుపుతున్నారా.. ప్రమాదం పొంచి ఉన్నట్లే..!

Highlights

Driving Car Wearing Sandals: కారు నడిపే విషయంలో కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి.

Driving Car Wearing Sandals: కారు నడిపే విషయంలో కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. లేదంటే ప్రమాదంలో పడే అవకాశాలు ఉంటాయి. కొంతమంది చెప్పులు ధరించి కారు నడుపుతారు. మరికొంతమంది షూ వేసుకొని కారు నడుపుతారు. ఇంకొందరు ఏవి వేసుకోకుండా కారు నడుపుతారు. ఇందులో చెప్పులు వేసుకొని కారు నడపడం వల్ల కొన్ని సమస్యలు తలెత్తుతాయి. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.

చెప్పులు ధరించి కారు నడిపితే మీక సౌకర్యాంగా ఉండవచ్చు. కానీ ఇది మంచిది కాదు ఎందుకంటే దీనికి కొన్ని నెగిటివ్స్‌ ఉన్నాయి. చాలామందికి ఈ విషయం తెలియకుండా చెప్పులు ధరించి డ్రైవ్ చేయడానికి ఇష్టపడతారు. అయితే చెప్పులు ధరించి నడపడం ప్రమాదకరం. అందువల్ల చెప్పులు ధరించి కారు నడపడం మానుకోవడం ఉత్తమం.

నిజానికి చెప్పులు పెడల్‌ను సరిగ్గా పట్టుకోవు. వీటి కారణంగా బ్రేక్, క్లచ్ లేదా యాక్సిలరేటర్ పెడల్‌పై కాలు జారిపోయే ప్రమాదం ఉంటుంది. సడెన్‌ బ్రేకింగ్ విషయంలో చెప్పులు పెడల్‌పై సులభంగా జారిపోతాయి. ఎందుకంటే వాటి పట్టు షూల మాదిరి ఉండదు. దీంతో కారు అదుపు తప్పి ప్రమాదం జరిగే అవకాశం ఉంది.

అంతే కాదు పెడల్స్ మధ్య చెప్పులు ఇరుక్కుపోయే ప్రమాదం కూడా ఉంటుంది. మాన్యువల్ కార్లలో మూడు పెడల్స్ ఉంటాయి - యాక్సిలరేటర్ పెడల్, బ్రేక్ పెడల్, క్లచ్ పెడల్. మీ కుడి కాలు యాక్సిలరేటర్ పెడల్, బ్రేక్ పెడల్‌పై మారుతూ ఉంటుంది. మీరు పాదాన్ని యాక్సిలరేటర్ పెడల్ నుంచి బ్రేక్ పెడల్‌కి లేదా బ్రేక్ పెడల్ నుంచి యాక్సిలరేటర్ పెడల్‌కి మార్చినప్పుడు స్లిప్పర్ పెడల్స్ మధ్య ఇరుక్కుపోయే ప్రమాదం ఉంటుంది.

ఈ పరిస్థితిలో చెప్పులు తొలగించడానికి ప్రయత్నిస్తు న్నప్పుడు మీరు అనుకోకుండా యాక్సిలరేటర్ లేదా బ్రేక్ పెడల్‌ను గట్టిగా నొక్కుతారు. దీనివల్ల కారు అదుపులో ఉండదు. అందుకే చెప్పులు ధరించి కారు నడపడం మానుకోవాలని సూచించారు. కారు నడపడానికి షూస్ మంచివి. ఇవి పెడల్స్‌పై మంచి పట్టును అందిస్తాయి. పెడల్స్‌పై పాదాలను మార్చడం కూడా సులభంగా ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories