పురుషులకి అలర్ట్‌.. ప్లాస్టిక్ బాటిళ్లలోని నీరు తాగుతున్నారా..!

Drinking water in plastic bottles can cause serious diseases
x

పురుషులకి అలర్ట్‌.. ప్లాస్టిక్ బాటిళ్లలోని నీరు తాగుతున్నారా..!

Highlights

పురుషులకి అలర్ట్‌.. ప్లాస్టిక్ బాటిళ్లలోని నీరు తాగుతున్నారా..!

Plastic Bottles Water: ఈ రోజుల్లో ప్రజలు ప్లాస్టిక్‌ వినియోగానికి చాలా అలవాటు పడిపోయారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించమని ఎంత చెప్పినా ప్రజలు వినడం లేదు. నీళ్ల బాటిల్‌ నుంచి ఆహారం తినే ప్లేట్ వరకు ప్రతీది ప్లాస్టిక్ వాడుతున్నారు. దీనివల్ల మనకి తెలియకుండానే చాలా వ్యాధులకి గురికావల్సి వస్తోంది. ఆఫీసుకు లేదా వర్కవుట్‌కి వెళ్లేటప్పుడు ప్లాస్టిక్ బాటిల్‌లో నీటిని తీసుకువెళుతాము. చాలా చోట్ల తాగునీటికి ప్లాస్టిక్‌ గ్లాసులే వినియోగిస్తున్నారు. దీనివల్ల చాలా అనర్థాలు జరుగుతున్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.

ప్లాస్టిక్ ఒక పాలిమర్. ఇందులో కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, క్లోరైడ్ ఉంటాయి. ఇవి కాకుండా ప్లాస్టిక్‌లో ఒక రకమైన రసాయనం ఉంటుంది. ఇది మన శరీరానికి చాలా ప్రాణాంతకం. వైద్యుల ప్రకారం రసాయనాలు, పాలిమర్లలో ఉండే మూలకాలు మన శరీరంలోకి వెళితే అది అనేక వ్యాధులకు దారి తీస్తుంది. నేటి రోజుల్లో ప్లాస్టిక్ వల్ల క్యాన్సర్ వ్యాధులు పెరిగిపోతున్నాయి.

ప్లాస్టిక్ బాటిల్ లో ఎక్కువ సేపు నీటిని ఉంచితే మంచిది కాదు. ఒక వ్యక్తి ఆ నీళ్లని తాగితే చాలా తీవ్రమైన వ్యాధులను కలిగిస్తుంది. పురుషులలో హార్మోన్ల ఆటంకాలు ఏర్పడుతాయి. ఇది కాకుండా స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుంది. కాలేయానికి తీవ్రమైన నష్టం జరుగుతుంది. అంతే కాదు మహిళల్లో రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. ఈ విషయంలో ప్రజలకు అవగాహన కల్పించడం చాలా అవసరం.

ప్రజలు ప్లాస్టిక్ బాటిళ్లను చాలా రోజులుగా ఫ్రిజ్‌లో ఉంచుతారు. దీనివల్ల ప్లాస్టిక్ బాటిల్‌లో ఉన్న DPA, ఇతర రసాయనాలు శరీరంలోకి చేరే అవకాశం ఉంటుంది. నీటికోసం రాగి పాత్రలు వాడితే మంచిది. ప్రాచీన కాలంలో కూడా ప్రజలు రాగి పాత్రలను మాత్రమే ఉపయోగించారు. వైద్యుల అభిప్రాయం ప్రకారం రాగి శరీరానికి చాలా పోషకమైన మూలకం. ప్రజలు రాగి పాత్రలో మాత్రమే నీరు తాగాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories