రోజు పాలు తాగడం వల్ల...

రోజు పాలు తాగడం వల్ల...
x
Highlights

పాలు మంచి పౌష్టికాహారం. పాలలో దాదాపుగా అన్ని పోషకాలు సమపాళ్లలో ఉంటాయి. అలాగే పాలు బ్యాలెన్స్‌డ్‌ డైట్‌ లాంటిది. ఐరన్‌, విటమిన్‌ సి తప్ప మిగిలిన అన్ని...

పాలు మంచి పౌష్టికాహారం. పాలలో దాదాపుగా అన్ని పోషకాలు సమపాళ్లలో ఉంటాయి. అలాగే పాలు బ్యాలెన్స్‌డ్‌ డైట్‌ లాంటిది. ఐరన్‌, విటమిన్‌ సి తప్ప మిగిలిన అన్ని పోషకాలుంటాయి. పాలు తాగడం వల్ల చాలా పోషకాలు మనకు అందుతాయి.వాటిలోని పోషకాలు హై బయోలాజికల్‌ వాల్యూ కలిగి ఉంటాయి. పాలలో ఉండే పోషకాలు వంద శాతం మనకు శరీరానికి ఉపయోగపడుతాయి. ప్రొటీన్‌, కార్బోహైడ్రేట్‌ ఫ్యాట్స్‌, కాల్షియం, బి విటమిన్‌, ఫ్యాట్‌ సోల్యుబుల్‌ విటమిన్స్‌ మొదలైనవి పాలలో ఎక్కువగా ఉంటాయి.

ఎదుగుతున్న పిల్లలు పాలు తాగడం వల్ల ఎముకలు పొడువుగా, మందంగా పెరిగి గట్టిపడతాయి. ఆర్యోగంగా ఉంటారు.గర్భవతులు పాలు తాగడం వల్ల పిండం వృద్ధి బాగుంటుంది. బాలింతలు పాలను తీసుకోవడం వల్ల వారి ఎముకల నుంచి పోయిన కాల్షియం తిరిగి చేరుతుంది. నడుం నొప్పి తగ్గి ఎముకల గుల్లదనం రాకుండా ఉంటుంది. నిద్రకు ఉపక్రమించే ముందు పాలు తాగడం వల్ల నిద్ర బాగా పడుతుంది. అలాగే బి12, విటిమిన్‌ డి లోపాలు రాకుండా చేస్తుంది.

స్త్రీ మెనోపాజ్‌ దశలో పాలు తాగడం చాలా ముఖ్యం . అలాగే పాలే కాదు పాల ఉత్పత్తులైన పనీర్‌ చీజ్‌, పెరుగు, మజ్జిగ ప్రతిరోజూ తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. పెరుగు, మజ్జిగల్లో మంచి బ్యాక్టీరియా శరీరాన్ని అరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇవి ఆరోగ్యానికి మరింత మంచిది.పాలు వీలైనంత నార్మల్‌గా తీసుకోవాలి. పాలలోని ఫ్యాట్‌ చూసి భయపడాల్సిన అవసరం లేదు. పాలలో ఏమీ కలపకుండా నార్మల్‌గా తీసుకుంటే మంచిది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories