చల్లని నీటిని తాగుతున్నారా? అయితే..

చల్లని నీటిని తాగుతున్నారా? అయితే..
x
Highlights

నీరు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతి రోజు సరైయనంత నీటిని తాగడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. పలు అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి నీరు ఎక్కువగా తాగమని...

నీరు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతి రోజు సరైయనంత నీటిని తాగడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. పలు అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి నీరు ఎక్కువగా తాగమని నిపుణులు కూడా సూచిస్తున్నారు. దీంతో చాలా మంది నీటిని ఎక్కువగా తాగుతుంటారు. ఎక్కువ మంది చల్లగా ఉండే నీటిని తాగేందుకు ఇష్టపడుతుంటారు. అది వేసవికాలంలో అయితే దాహంగా ఉందని ఫ్రిజ్‌లో గడ్డకట్టిన నీటిని తాగుతుంటారు.

అయితే మరీ చల్లగా ఉండే నీటిని తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయట. సాధరణంగా వేడి నీటిని తాగడం వల్ల చర్మ రంధ్రాలు తెరుచుకుంటాయట. అదే చల్లటి నీరు అయితే చర్మ రంధ్రాలు మూసుకుపోతుంటాయట. చల్లటి నీటిని తాగడం వల్ల జీర్ణాశయం కుచించుకుపోతుంది. అదే విధంగా చల్లటి నీరు జీర్ణమై రక్తంలో కలిసే వేగం తగ్గుతుందని.. ఇలా జరగడం వల్ల ఒక్కోసారి డీహైడ్రేషన్‌కి గురవుతుంటాంమని వైద్య నిపుణులు చెబుతున్నారు.

భోజనం చేస్తున్నప్పుడు కానీ ఏదైనా తిన్న తర్వాత చల్లటి నీటిని తాగడం వల్ల ఆహారంలోని కొవ్వుపదార్థాలు గడ్డకట్టుకుపోతాయి. దీని వల్ల జీర్ణాశయం తన స్థాయికి మించి పని చేయవలసి వస్తుంది. అందువల్ల చల్లటి నీటి కంటే గోరువెచ్చని నీటిని తాగడానికే ఉత్తమమం. ఇలా చేయడం వల్ల జీర్ణ సమస్యలతో పాటు బరువు తగ్గడానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories