Top
logo

పెగ్గు మీద పెగ్గు మందు కొడితే..

పెగ్గు మీద పెగ్గు మందు కొడితే..
X
Highlights

'మందు బాబులం మేము మందు బాబులం.. మందు కొడితే మాకు మేమే మహారాజులం' .. ఓ గేయ రచయిత చెప్పినట్టు మందు కొట్టిన...

'మందు బాబులం మేము మందు బాబులం.. మందు కొడితే మాకు మేమే మహారాజులం' .. ఓ గేయ రచయిత చెప్పినట్టు మందు కొట్టిన చాలమంది మగవాళ్లు మహారాజులా ఫీల్ అవుతుంటారు. యూత్‌లో చాలమంది సంతోషంలో మందు తాగుతారు.. బాధ కలిగితే బీర్ కొడతారు. లవ్‌లో పడ్డా తాగడమే.. లవ్ సక్సెస్, ఫెయిల్ అయినా తాగడమే.. పెళ్ళిళ్లు అయినా.. చావు కబురైనా.. కారణం వెత్తుకుని మరి.. పెగ్గు మీద పెగ్గు వేసే మందుబాబులు చాలామందే ఉన్నారు. గల్లీ నుంచి ఢిల్లీ దాక ఊగుతూ.. తూలుతూ హాయిగా ఎంజాయ్ చేస్తూ.. అర్థరాత్రి హల్‌చల్ చేసే యువత ఉన్నారు. అయితే.. ఇదంతా ఇప్పుడు బానే ఉంటుంది. 60 ఏళ్లు వచ్చాక కానీ దాని దుష్ప్రభావాలు కనిపించవని చెబుతున్నాయి పరిశోధనలు.

యవ్వనంలో ఎక్కువగా తాగి అరవై ఏండ్ల వయస్సులో ఉన్న కొంతమందిపై పరిశోధనలు జరిపారు. ఇందులో మందుతాగే అలవాటు లేనివారికి రెండు వ్యాధులుసోకితే, మందు తాగే అలవాటున్నవారికి మూడు అంతకన్నా ఎక్కువ వ్యాధులున్నట్లు తేలింది. సో.. పెగ్ మీద పెగ్ వేసి ఎంజాయ్ చేస్తున్న యువకుల్లారా.. కాస్త తాగేముందు ఓసారి ఆలోచించండి అంటున్నారు నిపుణులు. అతిగా తాగకండి.. రోగాల భారిన పడకండి అంటున్నారు పరిశోధకులు.

Next Story