Corn Soup: చలికాలంలో మొక్కజొన్న సూప్ తాగండి.. ఈ సమస్యలు తొలగించుకోండి

Drink Corn Soup in Winter Get Rid of These Problems | Winter Healthy Food
x

Corn Soup: చలికాలంలో మొక్కజొన్న సూప్ తాగండి.. ఈ సమస్యలు తొలగించుకోండి

Highlights

Corn Soup: చలికాలంలో వేడి వేడి మొక్కజొన్న సూప్‌ తాగితే ఆ కిక్కే వేరప్ప..!

Corn Soup: చలికాలంలో వేడి వేడి మొక్కజొన్న సూప్‌ తాగితే ఆ కిక్కే వేరప్ప..! మొక్కజొన్న ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఫైబర్‌ ఎక్కువగా ఉంటుంది. ఇది మలబద్దకాన్ని తొలగిస్తుంది. ఉదర సమస్యలను తగ్గిస్తుంది. మొక్కజొన్నలో విటమిన్ ఎ, బి, ఈ, మినరల్స్ ఉంటాయి దీని కారణంగా ఇది మన శరీరాన్ని అనేక వ్యాధుల నుంచి దూరంగా ఉంచుతుంది.

ఇది తినడానికి రుచికరమైనది పోషక మూలకాలతో నిండి ఉంటుంది. మీరు మొక్కజొన్నతో రకరకాల వంటలను వండవచ్చు. చలికాలంలోకార్న సూప్‌ చాలా బెస్ట్. దీనివల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. కంటిశుక్లం సమస్యను ఎదుర్కొంటున్న వ్యక్తులకు మొక్కజొన్న చాలా బెస్ట్. మొక్కజొన్నలో ఉండే ల్యూటిన్ క్యాటరాక్ట్ సమస్యను నివారిస్తుంది.

అంతేకాదు కంటి చూపును మెరుగుపరుస్తుంది. మొక్కజొన్నను సూప్ రూపంలో తాగండి. చలిలో కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. చల్లని వాతావరణంలో మొక్కజొన్న సూప్ తాగితే ఇది శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. అయితే సూప్ తయారు చేసేటప్పుడు కొంచెం నల్ల మిరియాల పొడిని తప్పకుండా కలపండి. ఇది శరీరాన్ని లోపల నుంచి ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.

చలికాలంలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు మరింత జాగ్రత్త అవసరం. స్వీట్ కార్న్ సూప్ తో మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు. ఇందులో ఉండే విటమిన్ బి శరీరంలో ప్రొటీన్లు, కొవ్వు జీవక్రియలను నియంత్రిస్తుంది. గుండె జబ్బుల నుంచి రక్షించడంలో మేలు చేసే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు మొక్కజొన్నలో పుష్కలంగా ఉంటాయి.

అందుకే చలికాలంలో గుండె సమస్యలకు దూరంగా ఉండాలంటే వారానికి మూడుసార్లు స్వీట్ కార్న్ సూప్ తాగండి. మొక్కజొన్నలో ఐరన్, విటమిన్ ఎ, థయామిన్, విటమిన్ బి-6, జింక్, మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories