Pressure Cooker: ప్రెషర్ కుక్కర్‌లో ఈ పదార్థాలను వండటం ఆపేయండి..లేకపోతే ప్రాణాలకే ప్రమాదం

Pressure Cooker
x

Pressure Cooker: ప్రెషర్ కుక్కర్‌లో ఈ పదార్థాలను వండటం ఆపేయండి..లేకపోతే ప్రాణాలకే ప్రమాదం

Highlights

Pressure Cooker : నేటి ఉరుకుల పరుగుల జీవితంలో వంట త్వరగా అయిపోవాలని అందరూ ప్రెషర్ కుక్కర్‌పైనే ఆధారపడుతున్నారు.

Pressure Cooker: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో వంట త్వరగా అయిపోవాలని అందరూ ప్రెషర్ కుక్కర్‌పైనే ఆధారపడుతున్నారు. పప్పు, అన్నం, కూరలు.. ఇలా ఏది వండాలన్నా కుక్కర్ ఉండాల్సిందే. సమయం ఆదా అవుతుంది కదా అని కుక్కర్‌లో అన్ని రకాల పదార్థాలను వండేయడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. కొన్ని ఆహారాలను కుక్కర్‌లో వండటం వల్ల వాటిలోని పోషకాలు నశించడమే కాకుండా, అవి మన శరీరంలో విషంగా మారే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

చాలా మంది అన్నాన్ని కుక్కర్‌లో వండుతుంటారు. కానీ ఇలా చేయడం వల్ల బియ్యంలోని స్టార్చ్ (పిండి పదార్థం) సరిగ్గా ఉడకక పోవడమే కాకుండా, అందులో ఆర్సెనిక్ అనే హానికరమైన మూలకాలు విడుదలయ్యే అవకాశం ఉంది. అన్నాన్ని విడిగా గింజ వార్చినట్లు వండుకుంటేనే ఆరోగ్యానికి మేలు. అలాగే ఆకుకూరలను కుక్కర్‌లో వండితే అధిక వేడి వల్ల వాటిలోని పోషకాలు, విటమిన్లు పూర్తిగా నశించిపోతాయి. పైగా ఇలా వండటం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం కూడా ఉందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.

పాలను లేదా పాలతో చేసిన పదార్థాలను కుక్కర్‌లో వేడి చేయడం వల్ల వాటి సహజ నిర్మాణం దెబ్బతింటుంది. పాలు విరిగిపోవడం లేదా గిన్నె అడుగున మాడిపోవడం వల్ల పౌష్టిక విలువలు తగ్గుతాయి. ఇక బంగాళదుంపలు, చిలగడదుంపలు వంటి పిండి పదార్థం ఎక్కువగా ఉండే కూరగాయలను కుక్కర్‌లో వండితే, వాటిలోని స్టార్చ్ వేగంగా విచ్ఛిన్నమై రక్తంలో షుగర్ లెవల్స్ ను అకస్మాత్తుగా పెంచేస్తాయి. చిక్కుడు జాతి గింజల్లో (బీన్స్) ఉండే లెక్టిన్ అనే మూలకం కుక్కర్ ఒత్తిడి వల్ల సరిగ్గా ఉడకకపోతే జీర్ణ సమస్యలకు, ఫుడ్ పాయిజనింగ్‌కు దారితీయవచ్చు.

టమాటా లేదా చింతపండు వంటి పుల్లని పదార్థాలను అల్యూమినియం కుక్కర్‌లో వండటం వల్ల అవి మెటల్‌తో చర్య జరిపి ఆహారాన్ని విషపూరితం చేస్తాయి. ఇది అసిడిటీ సమస్యలకు కారణమవుతుంది. వీలైనంత వరకు ఇలాంటి వాటిని స్టీల్ గిన్నెల్లో లేదా మట్టి పాత్రల్లో వండుకోవడం ఉత్తమం. పప్పు దినుసులను కూడా ముందు రోజు రాత్రే నానబెట్టుకుని, కుక్కర్‌కు బదులు విడిగా ఉడికించుకుంటే గ్యాస్ సమస్యలు రావు.

Show Full Article
Print Article
Next Story
More Stories