చీమే కదా అని చులకనగా చూడకండి..!

చీమే కదా అని చులకనగా చూడకండి..!
x
Highlights

నలిపితే చనిపోయే చిన్న జీవి చీమ. చాలా మంది చీమని చులకనగా చూస్తారు! మనం అతగా పట్టించుకోని చీమ తన శరీర బరువు కన్నా 10 రెట్లు బరువు మొస్తుందని చెపుతారు!...

నలిపితే చనిపోయే చిన్న జీవి చీమ. చాలా మంది చీమని చులకనగా చూస్తారు! మనం అతగా పట్టించుకోని చీమ తన శరీర బరువు కన్నా 10 రెట్లు బరువు మొస్తుందని చెపుతారు! కొంత మంది అయితే 100 రెట్లు మొయగలదని అంటారు. మరి కొందరు చీమ తన శరీర బరువు కన్నా 1000 రెట్లు బరువును సులువుగా మొస్తుందని చెపుతుంటారు. ప్రపంచాన్నే..ఆక్రమించుకునే శక్తి చీమలకు ఉందంటారు కొందరు! కాని ఇందతా అబద్దం! వాస్తవానికి చీమ తన శరీర బరువు కన్నా 5000 రెట్లు బరువును మొయగలదు. అది అంతా బరువును మొయడానికి సహాకరించే ముఖ్యమైన భాగ౦ మెడ. చీమ నోటితో పట్టుకున్న బరువుల్ని మెడ మోస్తు౦ది. చీమ మెడలో ఉ౦డే మెత్తని టిష్యూలు (కణజాలాలు) పొట్టను, తలను కప్పే గట్టి పొరకు (బాహ్య అస్థిప౦జర౦) అతుక్కుని ఉ౦టాయి. మన రె౦డు చేతుల్ని కలిపి వేళ్ల మధ్యలో వేళ్లను పెట్టి పట్టుకున్నట్లుగానే చీమ మెడలో ఉ౦డే మెత్తని టిష్యూలు బాహ్య అస్థిప౦జరానికి అతుక్కుని ఉ౦టాయి. మెత్తని పదార్థాలు గట్టి పదార్థాలు అతుక్కుని ఉ౦డడ౦ వల్ల బల౦ పెరుగుతు౦ది. అందువల్లే చీమలు అంత బరువుని మెడ మీద మోయగలవు.

ప్రపంచాన్నే ఆక్రమించుకునే శక్తి చీమలకు ఉంది! చీమల సంఖ్య మనుషుల సంఖ్యతో పోలిస్తే పది లక్షల రెట్లు ఎక్కువ.ఆర్కిటిక్‌, అంటార్కిటిక్‌ ఖండాల్లో తప్ప మిగిలిన ఐదు ఖండాల్లోనూ చీమలు నివస్తున్నాయి.ఇప్పటి వరకూ చీమల్లో 12,000 జాతులు వున్నాయి.అమెరికాలోని క్వీన్‌ చీమ 30 ఏళ్లకు పైగా బతుకుతుంది! కీటకాలన్నింటిలో ఎక్కువ కాలం బతికేది ఇదే! మాండిబ్లెస్‌ జాతి చీమలు గంటకు 230 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి! మారికోపా అనే చీమ కుడితే 12 తేనెటీగలు కుట్టినంత నొప్పి కలుగుతుంది! ఇథియోపియా అడవుల్లో 38 కిలోమీటర్లు చీమల పుట్టలు విస్తరించి ఉన్నాయి.

చీమలకు చెవులుండవు. అవి విడుదల చేసే రసాయానాల ద్వారా ఒక చీమ నుండి వెరొక చీమకు సంకేతాలు అందుతుంటాయి.ప్రమాదంలో ఉన్నాం, దాడి చెయ్యండి, ఓ దగ్గర బోలెడు ఆహారం ఉంది, రండి దారి చూపిస్తాను లాంటివి మాట్లాడుకోవడానికి వేరు వేరు మొత్తాల్లో రసాయనాల్ని విడుదల చేసుకుంటాయి.చీమలకు వూపిరితిత్తులు ఉండవసలు. స్పిరకిల్స్‌ అనే భాగాల ద్వారా శరీరం మొత్తానికీ ఆక్సిజన్‌ని పంపిచి జీవిస్తుంటాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories