Donald Trump: పంది మాంసం.. ఇదే ట్రంప్ సీక్రెట్.. ఈ కథ మీరు కూడా చదవండి

Donald Trump: పంది మాంసం.. ఇదే ట్రంప్ సీక్రెట్.. ఈ కథ మీరు కూడా చదవండి
x
Highlights

Donald Trump likes to eat Pork and BurgersUS President Donald Trump: అమెరికా 47వ అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్..తన దూకుడు నిర్ణయాలతో నిత్యం...

Donald Trump likes to eat Pork and Burgers

US President Donald Trump: అమెరికా 47వ అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్..తన దూకుడు నిర్ణయాలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. అధికారిక నిర్ణయాలకు మాత్రమే కాదు ఆయన ఆహార ప్రాధాన్యతలకు కూడా ప్రసిద్ధి చెందారు. ట్రంప్ ఎలాంటి ఆహారం తినేందుకు ఇష్టపడతారో చూద్దాం. ట్రంప్ ఎక్కువగా బిగ్ 4 ఫాస్ట్ ఫుడ్ కంపెనీలకు ప్రాధాన్యం ఇస్తుంటారు. వీటిలో మెక్ డొనాల్డ్స్, కేప్సీ, పిజ్జా, కోక్ ఉన్నాయి. అయితే ట్రంప్ సీఎన్ఎన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. తనకు శుభ్రంగా ఉండటం ఇష్టమని..ఆహారం ఎక్కడి నుంచి వస్తుందో తెలియని ఫుడ్ జోలికి వెళ్లనని చెప్పారు. అంటే ట్రంప్ ప్యాకెజ్డ్ ఫుడ్ తినను అని చెప్పారు.

డోనాల్డ్ ట్రంప్ మాజీ ప్రచార నిర్వాహకుడు 'లెట్ ట్రంప్ బి ట్రంప్' పుస్తక రచయిత కోరీ లెవాండోవ్స్కీ తెలిపిన వివరాల ప్రకారం.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సాధారణంగా 14 నుండి 16 గంటల పాటు ఆహారం లేదా పానీయం లేకుండా ఉంటారు. ఇక ఉదయం బ్రేక్ ఫాస్టులో పంది మాంసం, గుడ్లు తినడానికి ఇష్టపడతాడు. మధ్యాహ్న భోజనంలో చక్కని, జ్యుసి మీట్‌లోఫ్, కెచప్‌తో సహా అనేక రకాల ఫుడ్స్ ఉంటాయి. ఇక నైట్ డిన్నర్ కు , ట్రంప్ రెండు బిగ్ మాక్‌లు, రెండు ఫైలెట్-ఓ-ఫిష్, మెక్‌డొనాల్డ్స్ నుండి ఒక చిన్న చాక్లెట్ షేక్ తినడానికి ఇష్టపడతారని వివరించారు.

ఇది కాకుండా, ట్రంప్ కు శాండ్‌విచ్‌లు, పిజ్జా తినడం కూడా మహా ఇష్టమట. కానీ కోరీ లెవాండోవ్స్కీ కూడా ట్రంప్ గురించి ఒక షాకింగ్ విషయాన్ని చెప్పారు. తనకు ఇష్టమైన పానీయం విషయానికి వస్తే, ట్రంప్ కు మిల్క్ షేక్, కోక్ తాగడం అంటే చాలా ఇష్టం. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే 78 ఏళ్ల ట్రంప్ రోజుకు 12 డైట్ కోక్‌లు తాగుతారట. అయితే..ట్రంప్ కు ఫాస్ట్ ఫుడ్ తినడం అంటే ఇష్టం, కానీ వ్యాయామం చేయడం అంటే ఇష్టం ఉండదట. ఈ విషయాన్ని వైట్ హౌస్ మాజీ వైద్యుడు డాక్టర్ రోనీ జాక్సన్ వెల్లడించారు. న్యూయార్క్ టైమ్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, జాక్సన్ ట్రంప్ గురించి మాట్లాడుతూ, తాను చాలా అరుదుగా వ్యాయామం చేస్తారని తెలిపారు. అందుకే ట్రంప్ తీసుకునే ఆహారం తాము ప్రత్యేక శ్రద్ధ చూపిస్తామని వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories